AIIMS: ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా ఎంపిక చేస్తారు.. | AIIMS Patna Recruitment 2023 for 45 Junior Resident Posts. Apply online

0
5


కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పట్నాలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. తాత్కాలిక ప్రాతిపదికన 45 జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పట్నాలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. తాత్కాలిక ప్రాతిపదికన 45 జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు మర్చి 10, 2023వ తేదీ నాటికి 37 యేళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్న వారు మార్చి 20, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.1200లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.500లు ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు సమాధానం రాయవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ 20 మార్కులకు ఉంటుంది. రాత పరీక్ష మార్చి 23వ తేదీన నిర్వహిస్తారు. మర్చి 25న ఇంటర్వ్యూలు ఉంటాయి. ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here