కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం అని పేర్కొన్నారు. కుప్పం నియోజవకర్గంలో పోలీసులు టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ఆదేశాలతో 34 మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని..

రాష్ట్రంలో పోలీసు వ్యవస్ధ పక్షపాత దోరణితో పనిచేస్తోందని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం అని పేర్కొన్నారు. కుప్పం నియోజవకర్గంలో పోలీసులు టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ఆదేశాలతో 34 మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని.. రౌడీషీట్లు ఓపెన్ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వైసీపీ నాయకుల పట్ల ఒకలా.. టీడీపీ నాయకుల పట్ల మరోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని సైతం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన డీఎస్పీ సుధాకర్ రెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్సై కృష్ణయ్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో చంద్రబాబు డిమాండ్ చేశారు.

అంతకు ముందు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బీసీ నేతలతో సమావేశమయ్యారు. బీసీ ఫెడరేషన్ల ద్వారా ఒక్కరికైనా ఆర్థికసాయం చేశారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీసీలు సమస్యల సుడిగుండంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు లేని బీసీలు కుల వృత్తులపైనే ఆధారపడతారని.. బీసీలకు మొదటిసారి చేయూతను అందించింది టీడీపీ పార్టీ మాత్రమే అని చంద్రబాబు గుర్తు చేశారు.

ఆస్తులన్నీ దోచుకుని ఒక్కడే బాగుపడాలని జగన్ ఆలోచన అని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో సహజ సంపదను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మాట మాట్లాడితే బటన్ నొక్కానని సీఎం చెబుతారనీ.. అభివృద్ధి ఫలాలు మాత్రం కనిపించడం లేదని విమర్శించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *