తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు పార్టీకి టార్గెట్ ఫిక్స్ చేశారు… వందకు ఒక్కటి కూడా సీట్లు తగ్గకూడదంటూ కేడర్‌కు చెప్పుశారు. ఏదో గాలివాటంగా కాకుండా జనామోదంతో సాధికార విజయం సాధించాలని ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. గెలవడం పార్టీకి పెద్ద టాస్క్ కాదు… వందకు పైగా సీట్లు సంపాదించడం అసలు టాస్క్ అంటున్న కేసీఆర్ పనిచేయని నాయకుల తొకలు కట్ అవుతాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చారు కేసీఆర్.
తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(సీఎం కేసీఆర్) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్లీనరీకి హాజరైన ప్రతినిధులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని అన్నారు. అక్టోబర్‌లోనే ఎన్నికలు ఉంటాయన్నారు. ఎన్నికలకు మరో 4 నెలల టైమే ఉందని అనడంతో సంచలనంగా మారింది. ఇందు కోసం నేతలు ఇంట్లో కాదు.. ప్రజల్లో ఉండాలన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరికి సీఎం కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. వ్యక్తిగత ప్రతిష్టకు పోకుండా పార్టీ కోసం కలిసి పని చేయాలని అన్నారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని.. లీడర్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని అన్నారు. అందరూ ఎన్నికలే టార్గెట్‌గా పనిచేయాలని.. ఎలాంటి సమస్య ఉన్న హైకమాండ్ దృష్టికి తేవాలని సూచించారు.
టికెట్ల పంచాయితీ పై నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల్లో టికెట్ల పంచాయితీ ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. నేతలందరూ కలిసి పనిచేసుకోండి – టికెట్లు ఎవరికి ఇవ్వాలో నాకు తెలుసన్నారు. టికెట్ల పంచాయితీ మొదలైతే ప్రజల్లో వేరే మెసేజ్ వెళ్తదని హెచ్చరించారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ప్రజల్లోనే ఉండాలి… ప్రజలతోనే ఉండాలని సూచించారు.
మళ్లీ అధికారంలోకి రావడం ప్రాధాన్యతా కాదన్నారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు రావడమే ముఖ్యమని సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు సాధించుకున్నామని.. ఈసారి 100 సీట్లు వస్తాయన్న ధీమా తనకుందన్నారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో ప్రజాప్రతినిధులు గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకం అవ్వడంపై దృష్టి పెట్టాలన్నారు సీఎం కేసీఆర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం