సాధారణంగా జీలకర్ర అనేది ప్రతి వంటింట్లో ఉండేది. దానిని ప్రతి కూరల్లో వాడుతుంటారు. జీలకర్ర లేని ఇల్లు అంటూ ఉండదేమో. అయితే జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ఇందులో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. చలికాలంలోనే కాకుండా ఏ కాలంలో అయినా ఎన్నో..
సాధారణంగా జీలకర్ర అనేది ప్రతి వంటింట్లో ఉండేది. దానిని ప్రతి కూరల్లో వాడుతుంటారు. జీలకర్ర లేని ఇల్లు అంటూ ఉండదేమో. అయితే జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ఇందులో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. చలికాలంలోనే కాకుండా ఏ కాలంలో అయినా ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అందుకే జీలకర్రను నేరుగా కాకుండా.. నీళ్లతో కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతుంటారు వైద్య నిపుణులు. ఆరోగ్యంగా ఉండడానికి వాకింగ్, వ్యాయామం వంటివి చేయడానికి సమయం సరిపోవడం లేదు. చిన్న వయస్సులో శరీరం మనకు సహకరించడం మానేస్తుంది. కొన్ని సార్లు మనం పూర్తిగా మెడిసిన్ మీద ఆధారపడుతుంటాం.
వంట గదిలోనే ఎన్నో పదార్థాలుఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతున్నాయి. వంటింట్లో ఉండే జీలకర్రతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో జీలకర్ర చాలా ఉపయోగపడుతుంది. ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వివిధ రకాల వ్యాధుల నుంచి బయటపడవచ్చు. శ్వాస కోశ వ్యవస్థపై ఎఫెక్ట్ జీలకర్ర నీరు శ్వాస వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. జీలకర్రతో ఎన్నో ఆరోగ్య ఉపయోగాలున్నప్పటికీ పరిమితంగానే తీసుకోవాలి. ఎక్కువ వాడితే కొన్ని ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం కూడా ఉందంటున్నారు. రక్తపోటును కంట్రోల్ జీలకర్ర నీటిలో చాలా పొటాషియం ఉంటుంది. నిత్యం జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు ఎప్పుడూ కంట్రోల్లో ఉంటుంది.
గర్భధారణ సమయంలో..
గర్భధారణ సమయంలో జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ చాలా బలంగా మారుతుంది. గర్భీణీలు జీలకర్ర నీటిని తాగడంతో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, జీర్ణక్రియకు అవసరమైన ఎంజైములు ఉద్దీపనగా పని చేస్తుంటాయి. మధుమేహాయగ్రస్తులకు జీలకర్ర నీళ్లు చాలా మేలు చేస్తాయట. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. జీలకర్ర శరీరంలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది. కారణంగా రక్తంలో చక్కర స్థాయి నియంత్రణలో ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
జీలకర్రలో ఫైబర్..
అయితే జీలకర్రలో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని వివరిస్తున్నారు నిపుణులు. రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. నిత్యం జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల నిరోధకశక్తి బలంగా తయారవుతుంది. చాలా రకాల వ్యాధులతో పోరాటం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి