ఈ అధ్యయనం దాదాపు 11 సంవత్సరాలకు పైగా సాగింది. సుమారు 1,40,728 మంది వ్యక్తులు ఇందులో పాల్గొన్నారు. మొదటి రెండేళ్లలో డిప్రెషన్ తో బాధపడుతున్న వ్యక్తులను మినహాయించారు. మిగతా వారికి వేయించిన ఆహారాన్ని, ప్రత్యేకంగా వేయించిన్ బంగాళాదుంపలను తినే 8294 మంది వ్యక్తులలో

ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా మందికి ఇష్టమైన స్నాక్‌ ఐటమ్. కాలం మారినా ప్రజల క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ ఆహారం ఆరోగ్యకరమైనది కానప్పటికీ, ప్రజలు దీన్నే ఎక్కువగా ఇష్టపడతారు. ఇది శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా..? ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వేయించిన ఆహారాన్ని తరచుగా తినే వ్యక్తులు డిప్రెషన్‌కు గురవుతారు. అటువంటి ఆహారం తీసుకోని వారి కంటే 12 శాతం ఎక్కువ మంది డిప్రెషన్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్టుగా ఒక అధ్యయనంలో వెల్లడైంది.. ఫాస్ట్ ఫుడ్ తినని వారి కంటే వేయించిన ఆహార ప్రియులకు డిప్రెషన్ వచ్చే ప్రమాదం 7 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ జర్నల్‌లో పరిశోధన ప్రచురించబడింది. పరిశోధన ప్రకారం, మానసిక ఆరోగ్యం కోసం వేయించిన ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. కానీ పరిశోధనలలో ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా వెల్లడించారు.

నివేదికల ప్రకారం, నిపుణులు పరిశోధన ఫలితాలు ప్రాథమికంగా ఉన్నందున.. వేయించిన ఆహారాలు మానసిక ఆరోగ్య సమస్యలను పెంచుతాయా లేదా మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తీసుకుంటారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఈ అధ్యయనం దాదాపు 11 సంవత్సరాలకు పైగా సాగింది. సుమారు 1,40,728 మంది వ్యక్తులు ఇందులో పాల్గొన్నారు. మొదటి రెండేళ్లలో డిప్రెషన్ తో బాధపడుతున్న వ్యక్తులను మినహాయించారు. మిగతా వారికి వేయించిన ఆహారాన్ని, ప్రత్యేకంగా వేయించిన్ బంగాళాదుంపలను తినే 8294 మంది వ్యక్తులలో యాంగ్జయిటీ, 12,375 డిప్రెషన్ కేసులు గుర్తించారు. ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవడం వల్ల డిప్రెషన్ ప్రమాదాన్ని మరో 2 శాతం పెంచింది. ఇది ఎక్కువగా యువకుల్లో కనిపించింది.

ఇవి కూడా చదవండిమరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *