బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ప్రొటెక్షన్ ఇవ్వడం మాములు విషయం కాదు. అతనికి నిరంతరం థ్రెట్ ఉంటుంది. ఫ్యాన్స్ కూడా సల్మాన్ ఎక్కడికి వెళ్లినా.. వేలాదిగా తరలివస్తారు. దీంతో అతడిని హై సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
Salman Khan Bodyguard Shera
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు థ్రెట్ ఎక్కువ అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతడిని చంపుతామంటూ పలు ఫోన్ కాల్స్, లెటర్స్, మెయిల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సల్మాన్ ఎక్కడికి వెళ్లినా అతడి చూసేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఫ్యాన్స్ పోటెత్తుతారు. అలాంటి సల్మాన్ ఖాన్‌కు నిరంతరం రక్షణ ఇవ్వడమంటే మాములు విషయం కాదు. గత 25 సంవత్సరాలుగా సల్మాన్‌కు బాడీ గార్డ్‌గా వ్యహరిస్తున్నాడు షేరా అనే వ్యక్తి. సల్మాన్‌కు అత్యంత నమ్మకస్థుడిగా పేరొందాడు షేరా. అంతేకాదు.. విల్ స్మిత్, జస్టిన్ బీబర్ , జాకీ చాన్, మైక్ టైసన్, మైఖేల్ జాక్సన్‌లతో సహా అనేకమంది ఇతర అంతర్జాతీయ ప్రముఖులు ముంబైని సందర్శించినప్పుడు షేరా వారికి బాడీగార్డ్‌గా వ్యవహరించాడు. దీన్ని బట్టే అతడిచ్చే ప్రొటక్షన్, అతడికి ఉన్న గుడ్ విల్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
సల్మాన్‌ఖాన్‌కి బాడీగార్డ్‌గా ఉండటం వల్ల షేరా అందుకునే జీతం నెలకు దాదాపు రూ. 15 లక్షలు అని తెలిసింది. అయితే ఇది మాత్రమే కాదు.. అతని ఇంకా ఇన్ కమ్ సోర్సులు ఉన్నాయి. టైగర్ సెక్యూరిటీ సర్వీసెస్ స్టాపించిన షేరా.. ప్రజంట్ దానికి సీఈఓగా వ్యవహరిస్తున్నాడు. ఈ కంపెనీ ఫిల్మ్ ఇండస్ట్రీలోని హై-ప్రొఫైల్ సెలబ్రిటీలకు భద్రతను అందిస్తుంది. షేరా ఇతర బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులకు భద్రతా సేవలను అందించడం ద్వారా భారీ ఆదాయాన్ని అర్జిస్తున్నాడు.
షేరా నెట్ వర్త్ ఎంతో తెలుసా?
సల్మాన్ ఖాన్‌తో షేరాకు ఉన్న అనుబంధం కారణంగా అతడి ఆర్థికంగా బాగా ఎదిగాడు. షేరా నికర ఆస్తుల విలువ సుమారు 100 కోట్లుగా అంచనా వేస్తున్నారు. తన జీతం, నెట్ వర్త్ కారణంగా షేరానే ఇప్పుడు ఒక సెలబ్రిటీగా మారాడు. అతని గురించి పలుమార్లు మ్యాగజైన్‌లు, వార్తాపత్రికలలో కూడా కథనాలు వచ్చాయి. ఇండస్ట్రీకి అతడిచ్చే సేవలు కారణంగా బీ టౌన్‌లో జరిగిన అన్ని పెద్ద ఈవెంట్స్‌కు అతడికి ఇన్విటేషన్ ఉంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.