ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ది కేరళ స్టోరీ. ఈ చిత్రానికి డైరెక్టర్ సుదీప్తో సేన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అప్పట్లో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. హిందువుల కుటుంబంలో జన్మించిన ఓ అమ్మాయి శివ భక్తురాలు. తన స్నేహితురాలి మాటలతో ఇస్లాం మతంలోకి మారి ముస్లీం అబ్బాయిని పెళ్లి చేసుకుని ఐసీస్‏లో చేరడమే ఈ సినిమా కథ.

టాలెంటెడ్ హీరో నితిన్.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆదా శర్మ. ఈ సినిమాతో అందం, అభినయంతో కట్టిపడేసింది. అయితే ఈ మూవీ తర్వాత ఆమెకు అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆదా.. హిందీలోనూ నటించి మెప్పించింది. ఇప్పుడు ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ది కేరళ స్టోరీ. ఈ చిత్రానికి డైరెక్టర్ సుదీప్తో సేన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అప్పట్లో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. హిందువుల కుటుంబంలో జన్మించిన ఓ అమ్మాయి శివ భక్తురాలు. తన స్నేహితురాలి మాటలతో ఇస్లాం మతంలోకి మారి ముస్లీం అబ్బాయిని పెళ్లి చేసుకుని ఐసీస్‏లో చేరడమే ఈ సినిమా కథ. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు డైరెక్టర్ తెలిపారు.

తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే.. షాలిని ఉన్నికృష్ణ (అదా శర్మ) కేరళకు చెందిన అమ్మాయి. ఆమెకు శివుని పట్ల అపారమైన భక్తి ఉంటుంది. కుటుంబంతో ఎంతో సరదాగా ఉండే షాలిని ఉన్నత చదువులో కోసం హాస్టల్‌లో చేరుతుంది. అక్కడ ఆమెకు ఒక ముస్లిం యువతి స్నేహితురాలు అవుతుంది. తనతోపాటు ఉన్న ముగ్గురు అమ్మాయిలను ఆ యువతి ఇస్లాం మతంలోకి మారేలా ప్రేరేపిస్తుంది. ఒక సందర్భంలో, షాలినితోపాటు తన స్నేహితులపై ముగ్గురు యువకులు వేధిస్తూ బహిరంగంగా లైంగిక వేధింపులకు గురిచేస్తాుర. ఆ సమయంలో “హిజాబ్ ధరించిన మహిళలను ఎవరూ వేధించరని.. వారిని ఎవరూ ఆటపట్టించరని. ఎందుకంటే అల్లా వారి కోసం ఎప్పుడూ అండగా ఉంటాడని చెప్పడంతో ఆ యువతి మాటలతో ముస్లిం మతంలోకి మారతారు. షాలిని మతం మారి ఫాతిమాగా మారుతుంది. ఆ తర్వాత తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి.

పెళ్లి చేసుకున్న వ్యక్తితోపాటు ISISలో చేరడం.. అక్కడ ఆమె నరకం అనుభవించడం.. అక్కడి నుంచి తప్పించుకుని ఇండియాకు తిరిగి వస్తుంది. తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు చెప్పడం వరకు ది కేరళ స్టోరీ ట్రైలర్ లో స్పష్టంగా చూపించారు. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు డైరెక్టర్ తెలిపారు. ఇందులో మరోసారి ఆదా శర్మ తన నటనతో ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మే 5న తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి





మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed