Aravind B |

Updated on: Apr 28, 2023 | 12:47 PM

అసలే వేసవి కాలం. కొంతమంది దాహం తీర్చుకోవడానికి కూల్‌డ్రింక్స్ తాగుతారు. అలాగే మరికొందరు కొబ్బరి బొండాలపై ఆసక్తి చూపుతున్నారు. వాస్తవానికి చాలామంది కొబ్బరి నీళ్ల కంటే కూల్‌డ్రింక్స్ తాగేందుకే మొగ్గు చూపుతారు. కానీ కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని తాగితే మన శరీరానికి ఎన్నో లాభాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Apr 28, 2023 | 12:47 PM

రెగ్యులర్‌గా కొబ్బరి నీళ్లు తాగితే ఎల్లప్పుడు మన శరీరం హెడ్రేట్‌గా ఉంటుంది. ఫ్రెష్‌గా ఉన్న కొబ్బరి నీళ్లల్లో ఎటువంటి ఫ్లేవర్లు కలుపరు. అందుకే పచ్చి కొబ్బరి బొండం నీళ్లు తాగితే అవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల బ్లడ్‌లోని షుగర్ లెవల్స్ తగ్గుతాయని అలాగే ఇన్సూలిన్ సున్నితత్వాన్ని పెంచుతాయని పలు అధ్యయనాల్లో తెలిపాయి. మరో విషయం ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని కూడా ఆపే సామర్థ్యం ఈ కొబ్బరి నీళ్లకు ఉన్నట్లు వివరించాయి.

ప్రస్తుతం చాలామందికి గుండె సమస్యలు వస్తున్నాయి. వయసుతో తేడా లేకుండా ఎంతోమంది గుండెపోటుకి గురై అకాల మరణం చెందుతున్నారు. అయితే ఈ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ట్రెగ్లిజరైడ్, కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి, దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

కిడ్నిలో రాళ్లు పేరుకుపోవడం ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న సమస్య. చాలామందికి ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. మామూలుగా అయితే ఎక్కువగా నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉండదు. మాములు నీటి కంటే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఇంకా ఎంతో ఉపయోగం ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఒక కప్పు స్వచ్ఛమైన కొబ్బరి నీళ్లలో సుమారు 45 కెలరీలు మాత్రమే ఉంటాయి. కెలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువును అదుపులో ఉంచుతుంది. అలాగే ఇవి చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వర్కౌట్ చేసే ముందు, చేసిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి.

మీకు తెలుసా కొబ్బరి నీళ్లలో మాంగనీస్ కూడా ఉంటుంది. దీనివల్ల ఎసిడిటీ లాంటి జీర్ణ సమస్యలు కూడా దరిచేరవు. అలాగే ఇవి శరీరానికి యాంటీఆక్సిడంట్స్, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్‌ను అందిస్తాయి. దీనివల్ల శరీరంలోని విషపదార్థాలు కూడా బయటకి వెళ్లేందుకు సహాయపడతాయి.

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సాధారణంగా కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచివే. కానీ దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారికి ఇవి మంచివి కావని చెబుతున్నారు. ఒకవేళ మీ డైలీ లైఫ్‌లో రెగ్యులర్‌గా కొబ్బరి నీళ్లు తాగాలనుకుంటే వైద్యుని సలహా తీసుకోవడం మంచింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *