అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన మలేరియా అనాఫిలిస్ అనే ఆడ దోమ కుట్టడం వల్ల వస్తుంది. మలేరియా వ్యాధి సోకినప్పుడు ఔషధాలతో పాటు, శక్తి పెరగడానికి, త్వరగా కోలుకోవడానికి సరైన ఆహారం తీసుకోవాలి.
Apr 28, 2023 | 8:21 AM







లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి
Madhavi | Edited By: Surya Kala
Updated on: Apr 28, 2023 | 8:21 AM
Apr 28, 2023 | 8:21 AM
అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన మలేరియా అనాఫిలిస్ అనే ఆడ దోమ కుట్టడం వల్ల వస్తుంది. మలేరియా వ్యాధి సోకినప్పుడు ఔషధాలతో పాటు, శక్తి పెరగడానికి, త్వరగా కోలుకోవడానికి సరైన ఆహారం తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, మలేరియా అనేది నివారించదగిన వ్యాధి. ఇది చికిత్స ద్వారా తగ్గినప్పటికీ.. వ్యక్తి ఆరోగ్యంపై భయంకరమైన ప్రభావాన్ని చూపుతుంది.
మలేరియా వ్యాధి నుంచి త్వరగా కోలుకునే కొన్ని ఆహార పదార్థాలు ఇక్కడ ఉన్నాయి.
పౌష్టికాహారం తినడం:
మలేరియా వ్యాధి సోకిన తర్వాత పౌష్టికాహారం తీసుకుంటే కోలుకునే రేటు కూడా పెరుగుతుందని వైద్య నిపుణులు సూచించారు. రోగికి సమతుల్య ఆహారం ఇవ్వాలి. ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, ద్రవపదార్థాలు ఆహారంలో చేర్చాలి. ఈ ఆహారాలు అన్ని అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో ద్రవ సమతుల్యతను నిర్వహిస్తాయి.
శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోండి:
మలేరియా రోగులు తమను తాము హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొబ్బరి నీరు, నిమ్మరసం, మజ్జిగ, లస్సీ, సూప్, పప్పు పులుసు, యాపిల్ జ్యూస్, ఎలక్ట్రోలైట్స్ వంటి ద్రవాలను పుష్కలంగా తీసుకోవాలి.
సిట్రస్ పండ్లను తీసుకోవడం:
మలేరియాను నివారించడానికి, నిమ్మ, నారింజ, ద్రాక్ష, కివీస్ వంటి సిట్రస్ పండ్లను తినండి. ఈ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
తక్కువ ఫైబర్ ఆహారాలు తీసుకోవడం:
మలేరియా రోగులు తక్కువ ఫైబర్ ఆహారాలను తీసుకోవాలి. మెరుగైన ప్రేగు ఆరోగ్యం కోసం ఉడికించిన అన్నం, గంజి, కిచడీ. తేలికపాటి మూంగ్ పప్పు తినాలి.
ఆరోగ్యకరమైన ప్రొటీన్:
మలేరియాతో బాధపడే వారికి తగినంత పరిమాణంలో ఆరోగ్యకరమైన ప్రొటీన్లు ఉండే ఆహారాలు ఇవ్వాలి. వారికి పప్పులు, చికెన్, ఫిష్ స్టూ, చికెన్ సూప్, స్కిమ్డ్ మిల్క్, ఇతర పాల ఉత్పత్తులను తినిపించాలి.