వైవాహిక బంధంలో పొరపచ్చాలకు తోడు తీవ్ర అనారోగ్య సమస్యలు ఆమెను బాగా వేధించాయి. అయితే వాటికి కుంగిపోకుండా ఎదురొడ్డి పోరాడింది. యోధురాలిగా పేరు తెచ్చుకుంది. సమస్యలను సానుకూలంగా తీసుకోవడంలో నేటి తరం అమ్మాయిలకు ఆమె స్ఫూర్తి, ఆదర్శం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

పై ఫొటోలోని క్యూట్‌ లుక్స్‌తో ఉన్న చిన్నారి ఇప్పుడు ఓస్టార్‌ హీరోయిన్‌. సుమారు పుష్కర కాలం క్రితం సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ సొంతం చేసుకుంది. అందానికి తోడు అభినయ పరంగానూ మార్కులు తెచ్చుకుంది. దక్షిణాదిన ఉన్న స్టార్‌ హీరోలందరితోనూ స్ర్కీన్‌ షేర్‌ చేసుకుంది. ప్రొఫెషనల్‌ లైఫ్‌ పక్కన పెడితే పర్సనల్‌ లైఫ్‌ విషయాలతోనూ వార్తల్లో నిలిచిందీ అమ్మడు. వైవాహిక బంధంలో పొరపచ్చాలకు తోడు తీవ్ర అనారోగ్య సమస్యలు ఆమెను బాగా వేధించాయి. అయితే వాటికి కుంగిపోకుండా ఎదురొడ్డి పోరాడింది. యోధురాలిగా పేరు తెచ్చుకుంది. సమస్యలను సానుకూలంగా తీసుకోవడంలో నేటి తరం అమ్మాయిలకు ఆమె స్ఫూర్తి, ఆదర్శం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఆమెకు అభిమానగణం కూడా ఎక్కువే. అలా గత 12 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కెరీర్‌ కొనసాగిస్తూ, సమస్యలతో సాహసం చేస్తోన్న ఈ అమ్మడు ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్‌.. ఈ చిన్నారి మరెవరో కాదు టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత. ఇవాళ (ఏప్రిల్‌ 28) ఆమె పుట్టిన రోజు.

సామ్‌ బర్త్‌డే సందర్భంగా ఆమె అరుదైన, చిన్ననాటి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. పై ఫొటో కూడా అలాంటిదే. అందులో తన కుటుంబ సభ్యులతో ఎంతో చలాకీగా కనిపించింది సామ్‌. కాగా సామ్‌కు సోషల్‌ మీడియాలో బర్త్‌ డే విషెస్‌ వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు సామ్‌కు విషెస్‌ తెలుపుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే శాకుంతలం సినిమాతో ప్రేక్షకులను పలకరించిందీ అందాల తార. త్వరలో సిటాడెల్‌ అనే బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌తో మన ముందుకు రానుంది. అలాగే విజయ్‌ దేవరకొండతో కలిసి ఖుషి అనే మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *