అఖిల్, ఊర్వశి స్టెప్పులకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. గతంలో వాల్తేరు వీరయ్య చిత్రంలో బాస్ పార్టీ అంటూ సందడి చేసిన ఊర్వశి.. ఇప్పుడు మరోసారి ఏజెంట్ చిత్రంలో స్పెషల్ సాంగ్ తో అదరగొట్టేసింది. దీంతో తెలుగులో స్పెషల్ సాంగ్స్‏తో బిజీ అయిపోతుంది ఊర్వశి. మాస్ ఆడియన్స్తోపాటు.. అన్ని వర్గాల వారిని మెప్పించేవిధంగా ఈ సాంగ్ నిలిచింది.

అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ఏజెంట్. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ ఈరోజు (ఏప్రిల్ 28న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సాక్షి వైద్య కథానాయికగా నటించగా.. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేసింది. వైల్డ్ సాలా అంటూ సాగిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా… అఖిల్, ఊర్వశి స్టెప్పులకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. గతంలో వాల్తేరు వీరయ్య చిత్రంలో బాస్ పార్టీ అంటూ సందడి చేసిన ఊర్వశి.. ఇప్పుడు మరోసారి ఏజెంట్ చిత్రంలో స్పెషల్ సాంగ్ తో అదరగొట్టేసింది. దీంతో తెలుగులో స్పెషల్ సాంగ్స్‏తో బిజీ అయిపోతుంది ఊర్వశి. మాస్ ఆడియన్స్తోపాటు.. అన్ని వర్గాల వారిని మెప్పించేవిధంగా ఈ సాంగ్ నిలిచింది.

అయితే ఈ పాటలో ఊర్వశి ధరించిన డ్రెస్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సాంగ్ లో ఊర్వశి కోసం మేకర్స్ ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించారట. న్యూయార్క్ రెట్రో ఫ్రెట్ బ్రాండ్ లో ఊర్వశి లుక్ కు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఈ స్పెషల్ సాంగ్ కాస్ట్యూమ్ కు ఏకంగా రూ. 20 లక్షలు ఖర్చు చేసి డిజైన్ చేయించారని తెలుస్తోంది. ఇప్పుడిదే నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.

ఇప్పటివరకు లవర్ బాయ్ పాత్రలలో కనిపించిన అఖిల్ … మొదటిసారిగా ఈ మూవీలో యాక్షన్ హీరోగా కనిపించారు. సిక్స్ ప్యాక్ బాడీ.. ఉంగరాల జుట్టుతో ఫుల్ మాస్.. యాక్షన్ లుక్ లో కనిపించారు. ఈ సినిమా కోసం అఖిల్ ఎక్కువగానే కష్టపడినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *