నిరుద్యోగ యువత కోసం ఏప్రిల్‌ 21న నల్గొండలో నిర్వహించాల్సిన ‘ నిరుద్యోగ నిరాసన దీక్ష’తో కాంగ్రెస్‌లో అంతర్గత పోరు మరోసారి తెరపైకి వచ్చింది. నల్గొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు పలువురు సీనియర్ నేతలు..

నల్గొండ కాంగ్రెస్ రాజకీయం హాట్ హాట్‌గా సాగుతోంది. శుక్రవారం సాయంత్రం జరగనున్న ఈ నిరుద్యోగ దీక్షకు ముందు అంతర్గత పోరు కొనసాగుతున్నట్లుగా సమాచారం. నిరుద్యోగ యువత కోసం ఏప్రిల్‌ 21న నల్గొండలో నిర్వహించాల్సిన ‘ నిరుద్యోగ నిరాసన దీక్ష’తో కాంగ్రెస్‌లో అంతర్గత పోరు మరోసారి తెరపైకి వచ్చింది. నల్గొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు పలువురు సీనియర్ నేతలు ఇవాళ జరిగే నిరసన దీక్షకు రాకపోవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిరుద్యోగ యువతకు మద్దతుగా టీపీసీసీ నాయకత్వం దీక్షను ప్రకటించకముందే వాటిని ఫిక్స్ చేశామన్నారు. నల్గొండకు చెందిన పార్టీ అగ్రనేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డిలను సంప్రదించకుండానే టీపీసీసీ నాయకత్వం నల్గొండ సమావేశ తేదీని ఖరారు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నల్గొండకు చెందిన పలువురు నేతలు తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జికి ఫిర్యాదు చేశారు.

ఈ నిసన దీక్షకు దూరంగా ఉండేదెవరన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి కార్యకర్తల్లో ఉత్కఠను రేపుతోంది. వాస్తవానికి ఈనెల 21వ తేదీనే నల్గొండలో దీక్ష జరగాల్సి ఉంది. అయితే తమకు సమాచారం లేకుండా ఎలా నిర్వహిస్తారంటూ సీనియర్‌ లీడర్లు ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కార్యక్రమాన్ని ఈ రోజుకి రీ షెడ్యూల్ చేశారు. సాయంత్రం జరిగే దీక్షకు ఉత్తమ్‌, వెంకట్‌రెడ్డితోపాటు .. ఇతర సీనియర్ల హాజరుపైనా సస్పెన్స్ కొనసాగుతోంది.

నల్గొండకు చెందిన సీనియర్ నేతలకు, రేవంత్‌కు మధ్య కొంతకాలంగా గ్యాప్‌ కంటిన్యూ అవుతోంది. గతంలోనూ పలుమార్లు విభేదాలు బయటపడ్డాయి. నిరుద్యోగ దీక్షలు పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాలో పెట్టాలి కానీ… నల్గొండలో ఎందుకని ఇప్పటికే కోమటిరెడ్డి ప్రశ్నించారు..

ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇదే తరహాలో స్పందించారు. ఏప్రిల్ 21న నల్గొండలో టీపీసీసీ ధర్నా-కమ్-మీటింగ్ ఖరారు చేసిందని తనకు తెలియదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సరూర్‌నగర్‌లో ప్రియాంక గాంధీ బహిరంగ సభలో అందరూ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు పాల్గొంటారని అనడం విశేషం.ఇక ఈ రోజు కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 5 గంటలకు నల్గొండ మర్రిగూడ క్రాస్‌ రోడ్ నుంచి క్లాక్ టవర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు.. 7గంటలకు క్లాక్ టవర్ వద్ద నిరసన సభ ఉంటుంది.

ఇదిలావుంటే, జనగామ కాంగ్రెస్‌లో రచ్చ కంటిన్యూ అవుతోంది. ఓవైపు పొన్నాల వర్గం, మరోవైపు కొమ్మూరి వర్గం. ఇద్దరూ తగ్గేదే లే అంటున్నారు. ఈ రెండు గ్రూప్‌ల మధ్య కొనసాగుతున్న కోల్డ్‌ వార్ కాస్తా ఇప్పుడు రోడ్డెక్కింది. భట్టి సమక్షంలో జరిగిన గొడవపై స్పందించిన కొమ్మూరి పొన్నాలపై తీవ్ర విమర్శలు చేశారు. తాగుబోతులతో తనపై దాడి చేయించాలని పొన్నాల ప్రయత్నించాడని ఆరోపించారు కొమ్మూరి. పొన్నాలతో కాంగ్రెస్‌కు ఎలాంటి లాభం లేదన్నారు.

పాదయాత్రలో భాగంగా ఈ రోజు జనగామ వచ్చారు CLP లీడర్ భట్టివిక్రమార్క. ఆధిపత్యం కోసం పొన్నాల, కొమ్మూరి వర్గాలు పోటాపోటీగా ఏర్పాట్లు చేశాయి. ఆయన ఎదుటే వాగ్వాదానికి దిగారు కార్యకర్తలు. భట్టికి స్వాగతం పలికేందుకు పోటీపడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *