ఇటీవలే బలగం సినిమాతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఆయన నిర్మాణం వహించిన శాకుంతలం చిత్రంపై అనేక అంచనాలు పెరిగాయి. అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. భారీ వసూళ్లు రాబడుతుందనుకున్న ఈ మూవీ రూ. 10 కోట్లు సైతం చేరలేకపోయింది.

తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండానే వరుస సినిమాలను నిర్మిస్తుంటారు. స్టార్ హీరోలతో పెద్ద సినిమాలే కాదు.. ఎలాంటి స్టార్స్ లేకుండానే కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తూ హిట్స్ అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ఇండస్ట్రీలో ప్లాపులు ఎదురైన వాటిని తట్టుకుని ఇండస్ట్రీలో నిలబడే వారిలో దిల్ రాజు ముందుంటారు. ఇటీవలే బలగం సినిమాతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఆయన నిర్మాణం వహించిన శాకుంతలం చిత్రంపై అనేక అంచనాలు పెరిగాయి. అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. భారీ వసూళ్లు రాబడుతుందనుకున్న ఈ మూవీ రూ. 10 కోట్లు సైతం చేరలేకపోయింది.

అయితే ఈ సినిమా ముందు శాకుంతలం సినిమా గురించి దిల్ రాజు గొప్పగా చెప్పడంతో రిజల్ట్ తర్వాత ఆయనపై ట్రోలింగ్ జరిగింది. ఈ క్రమంలో తాజాగా శాకుంతలం రిజల్ట్ పై ఓపెన్ అయ్యారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ.. శాకుంతలం సినిమా మిస్ ఫైర్ అయ్యిందని.. సోమ, మంగళ వారాల్లో కలెక్షన్స్ రాలేదంటే ఇక ఫిక్స్ అయిపోవాలని.. రియలైజేషన్ కావాలన్నారు. శాకుంతలం సినిమా తనకు పెద్ద ఝలక్ ఇచ్చింది. నా 25 ఏళ్ల కెరీర్‏లో ఇది ఊహించలేదు అని అన్నారు. ఇటీవలే బలగం, దసరా సినిమాలతో హిట్స్ అందుకున్న దిల్ రాజు శాకుంతలం సినిమా మాత్రం నిరాశ పరిచిందనే చెప్పాలి.

డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సమంత ప్రధాన పాత్రలో నటించగా.. దేవ్ మోహన్, అల్లు అర్హ, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. అయితే ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *