Mishri Benefits: చాలా మంది ఇంట్లో తప్పని సరిగా పంచదార వాడుతుంటారు. అయితే పంచదారకు బదులుగా పటికి బెల్లం లేదా బెల్లం వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పంచదారతో పోల్చుకుంటే పటికిబెల్లంతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని
Mishri for Male Fertility and Health Benefits
Mishri Benefits:చాలా మంది ఇంట్లో తప్పని సరిగా పంచదార వాడుతుంటారు. అయితే పంచదారకు బదులుగా పటికి బెల్లం లేదా బెల్లం వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పంచదారతో పోల్చుకుంటే పటికిబెల్లంతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వారు వివరిస్తున్నారు. ఇంకా పంచదార కారణంగా వచ్చే షుగర్ వ్యాధి పటికిబెల్లంతో రాదని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా మగవారిలో సంతానోత్పత్తిని మెరుగుపరిచి, శృంగార సామర్థ్యం పెరిగేలా చేస్తుందంట. దీంతో పాటు మగవారిలో శృంగార కోరికలు, వీర్యకణాల వృద్ధికి కూడా పటికిబెల్లం ఉత్తమంగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు కూడా వెల్లడంచాయి. అసలు శృంగారానికే కాక పటికి బెల్లంతో ఏయే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..
సులభమైన జీర్ణం: నీరు కలపడం వల్ల సాధారణ చక్కెర కంటే మిశ్రి తేలికగా జీర్ణమవుతుంది. సాధారణ చక్కెరతో పోలిస్తే ఇందులో తీపి కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ వ్యాధి ప్రమాదం లేనే లేదు.
మౌత్ ఫ్రెషనర్: మిశ్రి కూడా మంచి మౌత్ ఫ్రెషనర్. చాలా మంది భారతీయులు దీనిని ఆహారం తర్వాత నోటి దుర్వాసన రాకుండా తీసుకుంటారు.
పొడి దగ్గు: మిమ్మల్ని రాత్రివేళల్లో పొడి దగ్గు కనుక ఇబ్బంది పెడుతుంటే చిన్న పటికి బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు. మీకు పొడి దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.
సహజ శీతలకరణి: సహజ శీతలకరణి కావడం వల్ల ఇది శరీరంలోని వేడి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
వికారం: శరీరంలో ఎసిడిటీ వల్ల కలిగే వికారం, వాంతుల అనుభూతులను తగ్గించడంలో మిశ్రి సహాయపడుతుంది.
జ్ఞాపకశక్తి: రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలలో మిశ్రీని కలిపి తీసుకుంటే జ్ఞాపకశక్తిని పెంచుతుంది. పటిక బెల్లం మతిమరుపుతో పాటు మెదడు అలసటని తగ్గిస్తుంది.