మొహాలీలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్‌జెయింట్‌ల మధ్య జరిగే మ్యాచ్‌లో ఇరు జట్లు విజయం సాధించేందుకు తీవ్రంగా పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో లక్నో సూపర్‌జెయింట్స్ ఒకదానిలో విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చివరి ఓవర్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇవాళ టాప్ ప్లేస్ కోసం రెండు జట్టుల పోటీకి సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య హోరా హోరీ పోరు మొహాలీలోని స్టేడియంలో జరగనుంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో లక్నో సూపర్‌జెయింట్స్ ఒకదానిలో విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చివరి ఓవర్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గెలిచిన జట్టు అగ్రస్థానానికి ఎదగడానికి అవకాశం ఉంది.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించగా.. 3 ఓటములతో 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ జట్టు 4 విజయాలు, 3 ఓటములతో 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఇరు జట్లూ తమ రన్ రేట్‌ను మెరుగుపరుచుకుని అగ్రస్థానంలో నిలిచి టోర్నీలో ప్లే ఆఫ్ అవకాశాలను కాపాడుకోవాలని భావిస్తున్నాయి.

శుక్రవారం మొహాలీ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఇరు జట్ల ఎలెవన్‌లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. లక్నో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా క్వింటన్ డి కాక్‌ని రంగంలోకి దించవచ్చు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భుజానికి గాయమైన శిఖర్ ధావన్ గత కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. శిఖర్ ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉండటంతో మళ్లీ సారథ్యం వహించే అవకాశం ఉంది. లక్నో మార్క్ వుడ్ అందుబాటులో ఉండకపోవచ్చు.

ఈ మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్ జట్టు గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుపై 13 పరుగుల తేడాతో విజయం సాధించి అదే స్ఫూర్తితో బరిలోకి దిగనుంది. మరోవైపు, లక్నో సూపర్‌జెయింట్స్ తమ చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఎడిషన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నో స్వదేశంలో రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు మొహాలీలో పంజాబ్‌ను ఓడించి రాహుల్ జట్టు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రాబబుల్ స్క్వాడ్: పంజాబ్ కింగ్స్: అథర్వ టైడ్, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.

లక్నో సూపర్‌జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్/క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నవీన్-ఉల్-హక్, శివమ్ మావి, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్

మరిన్ని క్రీడా వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *