IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో RCB స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 300కి పైగా పరుగులు చేశాడు. దీంతో పాటు ఐపీఎల్‌లో వరుసగా మూడు వందల కంటే ఎక్కువ పరుగులు చేసిన కింగ్ కోహ్లీకి ప్రత్యేక రికార్డు ఉంది.
Apr 28, 2023 | 5:17 AM







లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి
Venkata Chari |
Updated on: Apr 28, 2023 | 5:17 AM
Apr 28, 2023 | 5:17 AM
IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో RCB స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 300కి పైగా పరుగులు చేశాడు. దీంతో పాటు ఐపీఎల్‌లో వరుసగా మూడు వందల కంటే ఎక్కువ పరుగులు చేసిన కింగ్ కోహ్లీకి ప్రత్యేక రికార్డు ఉంది.
ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ 14 సీజన్లలో వరుసగా 300కి పైగా పరుగులు చేశాడు. 14 సీజన్లలో విరాట్ కోహ్లీ తప్ప మరే ఇతర ఆటగాడు 300+ పరుగులు చేయలేదు.
గతంలో ఈ రికార్డు శిఖర్ ధావన్, సురేశ్ రైనా పేరిట ఉండేది. ధావన్ వరుసగా 12 సీజన్లలో మూడు కంటే ఎక్కువ పరుగులు చేశాడు.
అలాగే, CSK జట్టు మాజీ ఆటగాడు సురేష్ రైనా కూడా వరుసగా 12 సీజన్లలో 300+ పరుగులు సాధించి ప్రత్యేక రికార్డును లిఖించాడు.
ఇప్పుడు విరాట్ కోహ్లీ వరుసగా 14వ సీజన్‌లో 300కి పైగా పరుగులు చేసిన వారందరినీ అధిగమించాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో అద్భుత ఫామ్‌ను కనబరిచిన కింగ్ కోహ్లీ 8 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 333 పరుగులు చేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ రేసులో 2వ స్థానంలో నిలిచాడు.
దీంతో పాటు ఐపీఎల్‌లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన భారత ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. కింగ్ కోహ్లి మొత్తం 53 సార్లు యాభైకి పైగా పరుగులు చేశాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ కూడా విరాట్ కోహ్లీనే. కింగ్ కోహ్లి ఇప్పటి వరకు 6903 పరుగులు సాధించగా, మరో 97 పరుగులు చేస్తే, ఐపీఎల్‌లో 7000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలుస్తాడు.