మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతోపాటు నీరు కూడా చాలా ముఖ్యం. ఆహారం లేకుండా అయినా వారాలపాటు బతుకుతాం. కానీ నీళ్లు లేకుండా నిమిషం ఉండలేము.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతోపాటు నీరు కూడా చాలా ముఖ్యం. ఆహారం లేకుండా అయినా వారాలపాటు బతుకుతాం. కానీ నీళ్లు లేకుండా నిమిషం ఉండలేము. మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది. కాలాలతో సంబంధం లేకుండా ప్రతిరోజూ పది గ్లాసుల నీళ్లు తాగాలని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు…శరీరం నిర్జలీకరణం బారినపడుతుంది.
కాబట్టి ఎండాకాలంలో నీరు పుష్కలంగా తాగాలి. అయితే చాలా మంది ఎండాకాలం వచ్చిందంటే ఫ్రిజ్ నిండా వాటర్ బాటిల్స్ నింపుతారు. వాటిని తాగుతుంటారు. కానీ రిఫ్రీజ్ రేటర్ లో ఉంచిన నీళ్లు తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి ఉంటుంది. మట్టి కుండనీళ్లే మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండాకాలంలో మట్టి కుండలో నీటి తాగడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
మట్టి కుండలో నీరు తాగడం వల్ల ఈ 6 రకాల హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు.
1. సహజ శీతలకరణి:
మట్టికుండలో నీరు ఉంచినప్పుడు నీరు మరింత సహజంగా చల్లబడుతుంది. మట్టకుండ ఉపరితలంపై ఉన్న చిన్న రంద్రాల ద్వారా నీరు త్వరగా ఆవిరైపోతుంది. భాష్పీభవన ప్రక్రియలో కుండలోపల నీరు వేడిని కోల్పోతుంది. ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.
2. దగ్గు, జలుబును నివారిస్తుంది:
ఫ్రిజ్ వాటర్ తాగడం వల్ల గొంతు చికాకు, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదురవుతాయి. మట్టికుండలో నీరుఖచ్చితమైన ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. మట్టి కుండలో నీళ్లు తాగుతే గొంతులో చికాకు, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉండవు. మట్టికుండలో నీరు ఆరోగ్యానికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.
3. ఆల్కలీన్:
మనం తీసుకునే ఆహారం శరీరంలోకి వెళ్లి ఆమ్లంగా మారి విషపదార్థాలను విడుదల చేస్తుంది. అయితే మట్టిలోని ఆల్కలీన్ కూర్పు తగిన పీహెచ్ సమతుల్యతను నివారించేందుకు సహాయపడుతుంది. దీంతో ఎసిడిటి, జీర్ణకోశ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
4. జీవక్రియను మెరుగుపరుస్తుంది:
మట్టికుండ నీరు రసాయన రహితం. కాబట్టి ప్రతిరోజూ తాగడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. నీటిలో ఉండే ఖనిజాలు జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడతాయి.
5. వడదెబ్బను నివారిస్తుంది:
ఎండాకాలంలో వడదెబ్బ అనేది ఒక సాధారణ సమస్య. మట్టికుండ నీటిలోని ఖనిజాలు, పోషకాలను రక్షిస్తుంది. మట్టికుండలో నీటిని తాగడం వల్ల వడదెబ్బ కొట్టే ప్రమాదం తగ్గుతుంది.
6. తాగేందుకు సురక్షితం:
మట్టికుండలోని నీటిని సేంద్రీయంగా శుభ్రపరిచేందుకు, చల్లబరిచేందుకు ఉపయోగించవచ్చు. నీటి పోరస్ మైక్రోటెక్చర్ కారణంగా ఈ నీళ్లు తాగేందుకు సురక్షితమైనవి. మట్టి కుండలోని నీరు కాలుష్య కారకాలను బయటకు పంపడంలో సహాయపడతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..