పైన ఫోటోలో ఉన్న చిన్నారి తల్లి కూడా అప్పట్లో స్టార్ హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో నటించింది. ఇటీవలే ఆమె నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద కెలక్షన్స్ వసూళ్లు రాబట్టింది. గుర్తుపట్టండి. ఆ చిన్నారి కుట్టి ఎవరో కాదు..

సినీ ఇండస్ట్రీలో వారసత్వం అనేది సాధారణమే. దక్షిణాది టూ ఉత్తరాది ఇండస్ట్రీలలో హీరోలుగా.. విలన్లుగా.. హీరోయిన్లుగా రాణించిన చాలా మంది తమ వారసులను సినీపరిశ్రమలోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో చాలా మంది హీరోల పిల్లలు సినీరంగంలోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు అందం, అభినయంతో స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తారల కూతుర్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం వెండితెరపై అలరిస్తున్న ముద్దుగుమ్మలు ఆ జాబితాలోకి చెందినవారున్నారు. పైన ఫోటోలో ఉన్న చిన్నారి తల్లి కూడా అప్పట్లో స్టార్ హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో నటించింది. ఇటీవలే ఆమె నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద కెలక్షన్స్ వసూళ్లు రాబట్టింది. గుర్తుపట్టండి. ఆ చిన్నారి కుట్టి ఎవరో కాదు.. హీరోయిన్ కీర్తి సురేష్.

కీర్తి సురేష్.. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత రెండవ చిత్రం మహానటితో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలనాటి మహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా వచ్చిన ఈ మూవీలో మెయిన్ లీడ్ రోల్ పోషించిన కీర్తి.. తన నటనతో సావిత్రినే మరిపించింది. దీంతో కీర్తికి తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. కానీ ఈ సినిమా తర్వాత కీర్తికి పాత్రపరంగా అంతగా ప్రాధాన్యత ఉన్న ఆఫర్స్ రాలేదు. ఇటీవలే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమాలో వెన్నెల పాత్రలో అల్లాడించేసింది కీర్తి.

కీర్తి సురేష్ తల్లి మేనకా సురేష్ కుమార్ ఒకప్పుడు అగ్ర కథానాయికగా కొనసాగారు. తమిళంలోనే కాదు.. తెలుగులోనూ ఆమె పలు సినిమాల్లో నటించారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌ కోయిల్‌లో 1963లో జన్మించారు. మేనక అసలు పేరు పద్మావతి. 1980లో విడుదలైన ‘రమాయి వయసుకు వంతుట్ట’ అనే సినిమా ద్వారా వెండితెరకి ఎంట్రీ ఇచ్చారు. ఆరేళ్లలోనే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఏకంగా 116 సినిమాల్లో నటించారు. చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పిన ‘పున్నమినాగు’ సినిమాలో మేనక హీరోయిన్‌గా నటించారు. ప్రముఖ నిర్మాత జీ. సురేష్ కుమార్ ను వివాహం చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు కీర్తి సురేష్ కథానాయికగా రాణిస్తోంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *