Vastu Tips: జ్యోతిష్యశాస్త్రం లాగానే వాస్తు శాస్త్రం కూడా మానవ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. చాలా మంది చిన్న చిన్న మార్పులు మన జీవితాలను మార్చేస్తాయా అంటూ వాస్తు శాస్త్రాన్ని కొట్టిపడేస్తుంటారు. అయితే వాస్తు దోషాలు కుటుంబంలోని.జ.

Vastu Tips: జ్యోతిష్యశాస్త్రం లాగానే వాస్తు శాస్త్రం కూడా మానవ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. చాలా మంది చిన్న చిన్న మార్పులు మన జీవితాలను మార్చేస్తాయా అంటూ వాస్తు శాస్త్రాన్ని కొట్టిపడేస్తుంటారు. అయితే వాస్తు దోషాలు కుటుంబంలోని ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులను అతలాకుతలం చేయగలవని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకే ఉండేది అద్దె ఇల్లు అయినా వాస్తు ఉండేలా చూసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటికి ఉండవలసిన ప్రధాన వాస్తు నియమాలేమిటో ఇప్పుడు చూద్దాం..

1. ఆగ్నేయ దిశలోని వంటగది స్త్రీలను మానసికంగా, శారీరకంగా స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ దిశలో రంగు వేయాల్సి వస్తే నారింజ రంగును ఉపయోగించండి.

2. మాస్టర్ బెడ్‌రూమ్ ఎప్పుడు కూడా నైరుతి దిశలోనే ఉండాలి. ఇలా ఉన్న కండిషన్‌లోనే ఇంటి పెద్ద స్థాయి హుందాగా, స్థిరంగా ఉంచుకోటానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి



3. పిల్లల గది లేదా అతిథి పడకగదుల కోసం కొద్దిగా ముదురు నీలం లేదా బూడిద రంగును ఎంచుకోండి.

4. గదిలో ఈశాన్య మూల చిందరవందరగా ఉండకూడదు. ఇండోర్ మొక్కలు, ఉత్తర మూలలో తెల్లటి పువ్వులు, నైరుతి మూలలో ఊదా లేదా ఎరుపు గులాబీలు సంబంధాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

5. మాస్టర్ బెడ్‌రూమ్‌లో మంచం నైరుతిలో ఉండాలి, మధ్యలో ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే అది వైవాహిక సమస్యలకు దారి తీస్తుంది.

6. బెడ్ రూమ్ ఒక చతురస్రాకారం లేదా దీర్ఘచతురస్రాకారంగానే ఉండాలి. వేరే షేప్‌లు ఉండకూడదు.

7. పొరపాటున కూడా ఇంట్లో మెటల్ బెడ్‌ను వాడకండి. ఎందుకంటే అవి నిద్రకు భంగం కలిగిస్తాయి. భాగస్వాముల మధ్య గొడవలను సృష్టిస్తాయి.

8. గోడ రంగులు తేలికగా, ప్రశాంతంగా ఉండాలి. వాతావరణం ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోవాలి. నైరుతి దిశలో పింక్ లేదా పీచు రంగు ఉండేలా చూసుకోండి.

9. మంచానికి నేరుగా ఎదురుగా ఉండే అద్దాన్ని ఉంచకూడదు. అద్దం ఎంత పెద్దదైతే, వైవాహిక బంధంలో ఒత్తిడికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed