India vs Australia: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియాలో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్‌లను బీసీసీఐ చేర్చుకుంది.

Wtc Final 2023 Team India

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఏప్రిల్ 24న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ 2023 కోసం భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు సంబంధించి ఇప్పటికే కొంతమంది ఆటగాళ్ల పేర్లు ఖరారు కాగా, అజింక్యా రహానే పునరాగమనం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కాకుండా రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్‌లతో సహా కొంతమంది ఆటగాళ్లను స్టాండ్‌బైగా చేర్చాలని భారత బోర్డు నిర్ణయించింది.

WTC రెండవ ఎడిషన్ చివరి మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లాండ్‌లోని ఓవల్ మైదానంలో జరగనుంది. ఇందులో ఈసారి ఆస్ట్రేలియా వర్సెస్ భారతదేశం మధ్య పోరు జరుగుతుంది. ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌తో పాటు నవదీప్‌ సైనీ, ముఖేష్‌ కుమార్‌లను కూడా స్టాండ్‌బై ప్లేయర్‌లుగా చేర్చాలని భారత సెలక్షన్‌ కమిటీ నిర్ణయించింది. వీరిని కూడా జట్టుతో లండన్‌కు పంపవచ్చని తెలుస్తోంది.

ఈ సమయంలో భారత జట్టులోని ప్రధాన ఆటగాళ్లందరూ ఐపీఎల్‌లో ఆడుతూ బిజీగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో భారత జట్టు ఫైనల్ మ్యాచ్‌కు సిద్ధం కావడానికి భారత బోర్డు కొన్ని సన్నాహక మ్యాచ్‌లను నిర్వహించే ఛాన్స్ ఉంది. తద్వారా భారత ఆటగాళ్లు ఇంగ్లండ్ పరిస్థితులకు అనుగుణంగా మారవచ్చు. ఐపీఎల్ ప్లేఆఫ్‌లకు ముందు ఎలిమినేట్ అయిన జట్లలో ఉన్న భారత ఆటగాళ్లు కోచ్ రాహుల్ ద్రవిడ్, సహాయక సిబ్బందితో కలిసి మే 23 నాటికి ఇంగ్లాండ్‌కు బయలుదేరుతారు.

ఇవి కూడా చదవండి



ఫాస్ట్ బౌలర్ కం ఆల్ రౌండర్‌గా శార్దూల్ కీలక పాత్ర..

టైటిల్ మ్యాచ్ కోసం భారత జట్టులో అవకాశం దక్కిన ఆటగాళ్ల గురించే మాట్లాడితే, చాలా కాలం తర్వాత టెస్ట్ జట్టులోకి తిరిగి వస్తున్న ఫాస్ట్ బౌలర్ ఆల్ రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్ ఇందులో ఉన్నాడు. శార్దూల్ ఇంతకుముందు ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన టెస్ట్ సిరీస్‌లో బంతితో పాటు బ్యాట్‌తో చాలా కీలక పాత్ర పోషించాడు. ఇటువంటి పరిస్థితిలో జట్టు మళ్లీ అలాంటి ప్రదర్శన చేస్తుందని ఆశిస్తుందన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed