ఈ మేరకు 2007 లో గ్యాంగ్ స్టర్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఘజీపూర్ మహమ్మాదా బాద్ పోలీసులు. 2007 నుంచి 16 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కేసులో ఘజిపూర్ ప్రజా ప్రతినిధుల కోర్టు నేడు తీర్పు వెలువరించింది.

లోక్ సభ సభ్యత్వానికి మరో ఎంపీ అనర్హుడు కాబోతున్నారు. రాహుల్ తర్వాత అనర్హత బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారిపై లోక్‌ సభ సభ్యత్వానికి అనర్హత వేటు పడనుంది. హత్య కేసులో బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ నాలుగేళ్ళ జైలు శిక్ష విధించింది ఘజిపూర్ ప్రజాప్రతినిధుల కోర్టు. గ్యాంగ్ స్టర్ యాక్ట్ కేసులో దోషిగా తేలారు బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారి. అతడు యూపీ ఘాజిపూర్ లోక్ సభ బీఎస్పీ ఎంపీగా ఉన్నారు. 2005 లో మాజీ ఎమ్మెల్యే కృష్ణా నందరాయ్ హత్య సహా నందకిషోర్ రుంగ్తా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇద్దరు సోదరులు ముక్తార్ అన్సారీ, అఫ్జల్ అన్సారీ. మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ కి 10 ఏళ్ళ జైలు శిక్ష, ఐదు లక్షల జరిమానా విధించింది కోర్టు. అఫ్జల్ అన్సారీకి నాలుగేళ్ళ జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా విధిస్తూ..ఉత్తరప్రదేశ్ ఘజిపూర్ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెలువరించింది.

గ్యాంగ్‌స్టర్ చట్టం కింద 2007లో నమోదైన కేసులో ముఖ్తార్ అన్సారీకి శనివారం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడింది. ఘాజీపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు గ్యాంగ్‌స్టర్-రాజకీయవేత్తకు రూ.5 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అతని అన్న ఘాజీపూర్‌కు చెందిన బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీకి కూడా రూ. లక్ష జరిమానాతోపాటు నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు. అఫ్జల్‌కు లోక్‌సభ సీటును కోల్పోవాల్సి రావడంతో ఈ తీర్పు అత్యంత కీలకమైనది. అంతకుముందు రోజు అన్సారీ సోదరులపై కిడ్నాప్, హత్య కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఘాజీపూర్ కోర్టు వెలుపల గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి1996 నాటి బొగ్గు వ్యాపారి, విశ్వహిందూ పరిషత్ ఆఫీస్ బేరర్ నందకిషోర్ రుంగ్తా కిడ్నాప్ కేసు, 2005 నాటి బిజెపి ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో ముఖ్తార్ ప్రమేయం ఉన్నందున అతనిపై కేసు నమోదు చేయబడింది. ఈ మేరకు 2007 లో గ్యాంగ్ స్టర్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఘజీపూర్ మహమ్మాదా బాద్ పోలీసులు. 2007 నుంచి 16 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కేసులో ఘజిపూర్ ప్రజా ప్రతినిధుల కోర్టు నేడు తీర్పు వెలువరించింది. 8 నెలలో ముక్తార్ అన్సారీకి నాలుగోసారి శిక్ష పడింది. 2022 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు నాలుగు కేసుల్లో దోషిగా నిర్దారించబడ్డారు ముక్తార్ అన్సారీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *