అక్కినేని అఖిల్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన స్పై-యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రాబట్టిన ఫస్ట్ డే..

అక్కినేని అఖిల్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన స్పై-యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రాబట్టిన ఫస్ట్ డే కలెక్షన్స్ నిరాశపరిచాయి. తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ కలిపి రూ. 4 కోట్లు, ఇతర భాషల్లో రూ. 3 కోట్లు వెరిసి ప్రపంచవ్యాప్తంగా రూ. 7 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సుమారు రూ. 80 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి ఆట నుంచి నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక యూఎస్‌లో ఈ సినిమా ప్రీమియర్స్, డే1 కలెక్షన్లు సుమారు 1 లక్షా 50 వేల డాలర్లు రాబట్టిందని ట్రేడ్ పండుతులు చెబుతున్నారు. ఈ పరిస్థితి చూస్తే.. సినిమా బ్రేక్ ఎవెన్ చేరుకునేసరికి ఎన్ని రోజులు పడుతుందో వేచి చూడాలి. కాగా, ఈ మూవీలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, డినో మోరియా ప్రధాన పాత్రలు పోషించారు. సాక్షి వైద్య హీరోయిన్ కాగా, హిప్ హాప్ టమిజా సంగీతం అందించాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *