ఈ సినిమాకు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. రిలీజ్ కు ముందు వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. అలాగే మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు.

అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఇక నిన్న(శుక్రవారం ) విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. రిలీజ్ కు ముందు వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. అలాగే మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. ఈ మూవీలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో హైలైట్ గా ఉన్నాయని అంటున్నారు చూసిన ప్రేక్షకులు.

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో అఖిల్ తో స్టెప్పులేసింది. ‘ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్’, ‘సురేందర్ 2 సినిమా’ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ మూవీ డిజిటల్ డీటైల్స్ విషయానికొస్తే.. ఈ సినిమాను 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు మేకర్స్.

‘ఏజెంట్’ చిత్రానికి అఖిల్ కెరీర్లోనే హయ్యెస్ట్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నైజాం 10.40 కోట్లు, సీడెడ్ 4.30 కోట్లు,
ఉత్తరాంధ్ర 3.60 కోట్లు, ఈస్ట్ 2.40కోట్లు, వెస్ట్ 2.10 కోట్లు, గుంటూరు 2.65 కోట్లు, కృష్ణా 2.20 కోట్లు, నెల్లూరు 1.08 కోట్లు, ఏపీ , తెలంగాణ (టోటల్) 28.73 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.40 కోట్లు, మలయాళం 0.70 కోట్లు, ఓవర్సీస్ 3.50కోట్లు, వరల్డ్ వైడ్ (టోటల్) 29.79 కోట్లు షేర్ రాబట్టింది ఈ సినిమా. ఏజెంట్ సినిమాకు రూ.34.33 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *