
మెగా స్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైనప్ చేసి ఆయా సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. బాస్ చేస్తోన్న సినిమాల్లో మెహర్ రమేష్ మూవీ ఒకటి. ఈ సినిమా భోళాశంకర్ అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. చాలా కాలం తర్వాత డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. ఈ మూవీ తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదలమ్ కు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్ నటిస్తున్నారు. మెయిన్ హీరోయిన్ గా తమన్నా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ చేస్తోన్న చిత్రబృందం.
చిరంజీవిని స్టైలిష్ మాస్ అవతార్‌లో చూపిస్తున్నారు మెహర్ రమేశ్. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్, కె ఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్, అర్జున్ దాస్, రష్మీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలైట్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో పాటలు కూడా అద్భుతంగా ఉంటాయని చిత్రయూనిట్ చెప్తోంది.
జూన్‌లో షూటింగ్ పూర్తవుతుంది. ఆగస్టు 11న సినిమాని రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ పేర్కొంది. తాజాగా ఓ భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తున్నారు. చిరంజీవి, షావర్ అలీ, వజ్ర అండ్ ఫైటర్స్, ఇతర ప్రముఖ తారాగణంపై ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. మరోవైపు డబ్బింగ్ పనులు కూడా మొదలెట్టేశారు.