• 29 Apr 2023 09:19 PM (IST)

    అదరగొట్టిన అభిషేక్ శర్మ, క్లాసెన్.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్

    ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (36 బంతుల్లో 67, 12 ఫోర్లు, ఒక సిక్స్‌), క్లాసెన్‌ (27 బంతుల్లో 53, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఢిల్లీ బౌలర్లను బెంబేలెత్తించారు.

  • 29 Apr 2023 08:52 PM (IST)

    నిలకడగా హైదరాబాద్ బ్యాటింగ్.. క్రీజులో ఎవరున్నారంటే?

    ఢిల్లీ బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో సన్ రైజర్స్ ఆత్మరక్షణ ధోరణితో బ్యాటింగ్ చేస్తోంది. 16 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 152/5. క్లాసెన్ (17 బంతుల్లో 33), సమద్ (17 బంతుల్లో 20) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 08:14 PM (IST)

    అభిషేక్‌ శర్మ దూకుడు

    ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ రెచ్చిపోయాడు. కేవలం 27 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌ లో 9 ఫోర్లు, 1 సిక్స్‌ ఉన్నాయి. అతనికి తోడుగా మర్కరమ్‌ (6) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోరు 8 ఓవర్లు ముగిసే సరికి 86/2

  • 29 Apr 2023 08:01 PM (IST)

    హైదరాబాద్ కు వరుస షాక్ లు..

    హైదరాబాద్‌కు తొలి దెబ్బ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5) మళ్లీ నిరాశపర్చాడు .  ఇషాంత్ వేసిన మూడో ఓవర్ మూడో బంతికి ఆడబోయి వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ చేతికి చిక్కాడు. ఆతర్వాత రాహుల్ త్రిపాఠి (10) కూడా వెంటనే ఔటయ్యాడు. ప్రస్తుతం ఎస్ఆర్ హెచ్ స్కోరు 5.2 ఓవర్లు ముగిసే సరికి 50/2

  • 29 Apr 2023 07:45 PM (IST)

    ఇరు జట్ల ప్లేయింగ్-XI ఇదే..

    DC

    డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్ ( వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్, రిప్పల్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్కియా, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్

    SRH

    ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, అకిల్ హుస్సేన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్.

  • By admin

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *