Venkata Chari |

Updated on: Apr 29, 2023 | 5:15 AM

IPL 2023 Most Wickets: ఐపీఎల్ ప్రస్తుత సీజన్ దాదాపు సగం ముగిసింది. ఇప్పటి వరకు ఈ లీగ్‌లో భారత బౌలర్లు విధ్వంసం సృష్టించారు. అత్యధిక వికెట్లు తీసిన టాప్-5లో నలుగురు భారతీయులు ఉన్నారు.

Apr 29, 2023 | 5:15 AM

IPL 2023 ప్రయాణంలో దాదాపు సగం పూర్తయింది. ఈ సమయంలో అనేక అద్భుతమైన, ఉత్తేజకరమైన మ్యాచ్‌లు కనిపించాయి. ఐపీఎల్‌లో ఫోర్లు, సిక్స్‌ల వర్షం కురిపించే వారి గురించే ఎక్కువగా చర్చ జరుగుతుంది. అయితే, బౌలర్లను కూడా విస్మరించలేం. ఈ సీజన్‌లో ఇప్పటివరకు భారత బౌలర్ల జోరు కనిపించింది. అత్యధిక వికెట్లు తీసిన టాప్-5లో నలుగురు భారతీయులు ఉన్నారు.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మొత్తం 37 మ్యాచ్‌లు జరగ్గా, ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భారత్‌కు చెందిన మహ్మద్ సిరాజ్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న సిరాజ్ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు పడగొట్టాడు.

రెండో స్థానంలో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన రషీద్ ఖాన్ ఉన్నాడు. రషీద్ ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు తీశాడు. టాప్-5లో ఉన్న ఏకైక విదేశీ ఆటగాడు రషీద్. సిరాజ్, రషీద్ మధ్య వ్యత్యాసం ఎకానమీ రేటు మాత్రమే.

భారత ఆటగాడు తుషార్ దేశ్‌పాండే మూడో స్థానంలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్, మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. తుషార్ ఎకానమీ రేటు 10.90గా నిలిచింది. అందుకే అతను మూడో స్థానంలో ఉన్నాడు.

భారత్ తరపున ఆడిన వరుణ్ చక్రవర్తి ఈ విషయంలో నాలుగో స్థానంలో ఉన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో ఈ మిస్టరీ స్పిన్నర్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.

పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న అర్ష్‌దీప్ సింగ్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ లెఫ్టార్మ్ ఇండియన్ బౌలర్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ ఎకానమీ రేటే 8.16, వరుణ్ 8.05 ఎకానమీ రేటు కలిగి ఉన్నాడు. కాబట్టి వరుణ్ ముందుకు వచ్చాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *