IPL 2023 Prize Money: IPL 2023 సీజన్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ సీజన్‌లో బలమైన ప్రదర్శన కారణంగా చాలా మంది ఆటగాళ్లు అగ్రస్థానంపై కన్నేశారు. ఇందులో బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు కూడా ఉన్నారు. ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ పోటీదారులను పరిశీలిస్తే, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ కూడా ఈ లిస్టులో ఉన్నారు.

IPL 2023 సీజన్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ సీజన్‌లో బలమైన ప్రదర్శన కారణంగా చాలా మంది ఆటగాళ్లు అగ్రస్థానంపై కన్నేశారు. ఇందులో బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు కూడా ఉన్నారు. ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ పోటీదారులను పరిశీలిస్తే, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. ఇక బౌలర్ల విషయానికి వస్తే మహ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్ పర్పుల్ క్యాప్ కోసం పోటీపడుతున్నారు. ఈ సీజన్ ఫైనల్ తర్వాత ఆటగాళ్లకు భారీగా ప్రైజ్ మనీ దక్కనుంది. కొన్ని నివేదిక మేరకు ఎవరికి ఎంత మనీ అందనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ మే 28న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అంతకుముందు మే 26న క్వాలిఫయర్ 2 కూడా ఇదే మైదానంలో నిర్వహించనున్నారు. ఫైనల్ మ్యాచ్ తర్వాత ఆటగాళ్లకు ప్రైజ్ మనీ అందజేస్తారు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ అవార్డుతోపాటు ప్రైజ్ మనీ రూ. 15 లక్షలు అందించనున్నారు. అదే సమయంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్ ఇవ్వనున్నారు. అలాగే ప్రైజ్ మనీ రూ.15 లక్షలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వీటితోపాటు వర్ధమాన ఆటగాడికి రూ.20 లక్షలు, సూపర్ స్ట్రైకర్‌కు రూ.15 లక్షలు, అత్యంత విలువైన ఆటగాడికి రూ. 12 లక్షలు, అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌కు రూ. 12 లక్షలు ఇవ్వనున్నారు.

ఇవి కూడా చదవండి



IPL 2023 ఎడిషన్ గురించి మాట్లాడితే.. ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం ఆర్‌సీబీ ప్లేయర్ ఫాఫ్ డు ప్లెసిస్‌ వద్ద ఉంది. 8 మ్యాచ్‌ల్లో 422 పరుగులు చేశాడు. అతను 5 అర్ధ సెంచరీలు సాధించాడు. ఈ విషయంలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లి 8 మ్యాచ్‌ల్లో 33 పరుగులు చేశాడు. చెన్నైకి చెందిన డెవాన్ కాన్వే, రితురాజ్ గైక్వాడ్ వీరిద్దరికీ పోటీ ఇస్తున్నారు.

పర్పుల్ క్యాప్ గురించి మాట్లాడితే, మహ్మద్ సిరాజ్‌ 8 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచాడు. రషీద్ ఖాన్ 7 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. చెన్నైకి చెందిన తుషార్ దేశ్‌పాండే కూడా పోటీ చేస్తున్నారు. 14 వికెట్లు కూడా తీసి మూడో స్థానంలో నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *