దేశంలోని ప్రసిద్ధ స్టేడియాలలో ఒకటైన ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కోల్‌కతాను ముందుగా బ్యాటింగ్‌కు పిలిచింది. కానీ ఆ వెంటనే కురిసిన వర్షం..

Rashid Khan, Nitish Rana, Andre Russell

దేశంలోని ప్రసిద్ధ స్టేడియాలలో ఒకటైన ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ ఐపీఎల్ మ్యాచ్‌కి ముందుగా టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కోల్‌కతాను ముందుగా బ్యాటింగ్‌కు పిలిచింది. కానీ ఆ వెంటనే కురిసిన వర్షం కారణంగా మ్యాచ్ కొంతం ఆలస్యం ప్రారంభమయింది. అయితే ఈ ఐపీఎల్ మ్యాచ్‌ ద్వారా కోల్‌కతా టీమ్‌లోని ముగ్గురు, అలాగే గుజరాత్ టైటాన్స్‌లోని ఓ ఆటగాడు అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఈ మ్యాచ్‌తో కోల్‌కతా టీమ్‌లోని ఆండ్రీ రస్సెల్ 150, నితీష్ రాణా 100..గుజరాత్ జట్టులోని రషిద్ ఖాన్ 100వ ఐపీఎల్ మ్యాచ్‌ని పూర్తి చేసుకుంటున్నారు.

అయితే మరో విశేషమేమిటంటే.. రస్సెల్‌కి ఇది 150వ మ్యాచ్ పూర్తి చేసుకుంటున్న మ్యాచ్ మాత్రమే కాక అతని పుట్టిన రోజు కూడా. ఇక ఐపీఎల్ క్రికెట్‌లో రస్సెల్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఎప్పుడూ అభిమానులను అలరిస్తుంటాడు. మరోవైపు 100 ఐపీఎల్ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న కోల్‌కతా కెప్టెన్ నితిష్ రాణా 94 ఇన్నింగ్స్‌లలో 2414 పరుగులు చేశాడు. వీటిలో 16 ఆర్థ శతకాలు కూడా ఉన్నాయి. ఇంకా 20 ఇన్నింగ్స్‌లో బౌలింగ్ కూడా వేసి మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు.

రాణాతో పాటు 100వ మ్యాచ్‌ ఆడుతున్న రషిద్ ఖాన్ కూడా గుజరాత్ తరఫున ఆడుతున్న అత్యుత్తమ బౌలర్. ఐపీఎల్ 100 మ్యాచ్‌లకు 100 ఇన్నింగ్స్ ఆడిన రషిద్ ఏకంగా 126 వికెట్లు తీసుకున్నాడు. అలాగే 46 ఇన్సింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసి 326 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *