గుజరాత్ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ (24 బంతుల్లో 51, 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అదరగొట్టాడు. అతనికి తోడు (35 బంతుల్లో 49), మిల్లర్ ( (18 బంతుల్లో 32) 180 పరుగుల టార్గెట్‌ను 13 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది గుజరాత్.
అహ్మదాబాద్‌లో కోల్‌కతా చేతిలో ఎదురైన ఓటమికి గుజరాత్ ప్రతీకారం తీర్చుకుంది. అప్పుడు కోల్ కతా ప్లేయర్ రింకూసింగ్ 5 సిక్సర్లు కొట్టి గుజరాత్‌ను ఓడిస్తే.. ఇప్పుడు త్రీడిప్లేయర్ విజయ్ శంకర్ అదే 5 సిక్స్‌లు కొట్టి కోల్‌కతాను ఓడించారు. తద్వారా సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన పరాభవానికి గుజరాత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయ్యింది. గుజరాత్ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ (24 బంతుల్లో 51, 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అదరగొట్టాడు. అతనికి తోడు (35 బంతుల్లో 49), మిల్లర్ ( (18 బంతుల్లో 32) 180 పరుగుల టార్గెట్‌ను 13 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది గుజరాత్. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కోల్‌కతాను కట్టడి చేసిన జోష్వాలిటిల్ (25/2) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. టోర్నీలో ఆరో విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకింది. అదే సమయంలో 6 పరాజయాలతో కోల్ కతా పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది.
Top professionals, top performances, on top of the table 🔝#AavaDe | #KKRvGT | #TATAIPL 2023 pic.twitter.com/LqFAdAuBkV
— Gujarat Titans (@gujarat_titans) April 29, 2023
భారీ స్కోరు లక్ష్య ఛేదనలో శుభ్‌మన్ గిల్ ధాటిగా ఆడాడు. సాహాతో కలిసి మొదటి వికెట్ కు 4 ఓవర్లలో 41 పరుగులు జోడించాడు. అయితే నరైన్ బౌలింగ్ లో సాహా ఆండ్రీ రస్సెల్ చేతికి చిక్కాడు. ఆతర్వాత గిల్, పాండ్యాలిద్దరూ కలిసి రెండో వికెట్ కు 50కు పైగా రన్స్ జోడించారు. అయితే 11వ ఓవర్లో గుజరాత్ స్కోరు 91 పరుగుల వద్ద జట్టు పటిష్ట స్థితిలో ఉన్న సమయంలో తొలి మ్యాచ్ ఆడుతున్న హర్షిత్ రాణా హార్దిక్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే సునీల్ నరైన్ గిల్‌ను పెవిలియన్‌కు తిప్పాడు. దీంతో కేకేఆర్ మళ్లీ పోటీలోకి వచ్చింది. అయితే విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్ మెరుపులు మెరిపించడంతో కోల్ కతాకు పరాజయం తప్పలేదు.
— Gujarat Titans (@gujarat_titans) April 29, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..