మహేశ్ బాబు ఎప్పుడు చాలా సింపుల్‌గా కనిపిస్తారు. ఏదైనా వేడుకలకు వచ్చినప్పుడు కూడా సాదాసీదాగానే ఉంటారు. అయితే వెకేషన్స్‌కు వెళ్లినప్పుడు మాత్రం మహేశ్ కాస్ట్లీ గ్లాసెస్ ధరిస్తారు. ఆ సమయంలో ఆ షూ నుంచి క్యాప్ వరకు అన్నింటిపై నెటిజన్ల ఫోకస్ పడుతుంది.

Mahesh Babu with family at airport

షూటింగ్ నుంచి కాస్త గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్తారు మహేశ్ బాబు. మన దేశంలో అయితే మహేశ్ ఎక్కడికి వెళ్లినా.. ఫ్యాన్స్ చుట్టుముడతారు. అస్సలు ప్రైవసీ దొరకదు. అందుకే ఆయన ఎక్కవగా ఫారెన్ కంట్రీస్‌కు వెళ్తారు. తాజాగా ట్రిప్‌కు వెళ్లిన ఆయన.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాకు కనిపించారు. ఆ సమయంలో మహేశ్ తన భుజానికి కాస్ట్లీ లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ MM బ్యాక్‌ప్యాక్‌తో కనిపించారు. దీంతో ఆ బ్యాగ్‌పై నెటిజన్ల ఫోకస్ పెట్టింది. దాని ధర ఎంతో చెప్పమ్మా అంటూ గూగుల్ తల్లిని అడగడం ప్రారంభించారు.

క్రిస్టోఫర్ MM బ్యాక్‌ప్యాక్‌ను హై-ఎండ్ ఫ్యాషన్‌గా భావిస్తారు.  నలుపు, నీలం డిజైన్‌తో ఎంతో అందంగా ఉంటుంది ఈ బ్యాగ్.  LV మోనోగ్రామ్ సిగ్నేచర్ డిజైన్ కూడా బ్యాగ్‌పై ఉంది. ఈ బ్యాగ్ ధర 3,92,656 రూపాయలు. మీరు చదివింది నిజమే. స్టైల్ పరంగా మాత్రమే కాదు.. ఎంతో ఉపయుక్తంగా కూడా ఉంటుంది. సొగసైన డిజైన్‌తో,  విశాలమైన కంపార్ట్‌మెంట్లను ఈ బ్యాగ్ కలిగి ఉంటుంది.

ప్రజంట్ మహేష్ బాబు, త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఈ సినిమా చేస్తున్నారు.  SSMB 28 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల కంప్లీట్ అయ్యింది. మహేష్, పూజా హెగ్డే  పాల్గొనగా  కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించారు. సినిమా షూటింగ్ లేట్ అవుతుండటంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed