ప్రముఖ నటి బిగ్‌ బాస్‌ ఫేమ్‌ పూజా రామచంద్రన్‌ తల్లిగా ప్రమోషన్‌ పొందింది. శనివారం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని పూజ భర్త, ప్రముఖ విలన్‌ జాన్‌ కొక్కెన్‌ సోషల్‌మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.

ప్రముఖ నటి బిగ్‌ బాస్‌ ఫేమ్‌ పూజా రామచంద్రన్‌ తల్లిగా ప్రమోషన్‌ పొందింది. శనివారం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని పూజ భర్త, ప్రముఖ విలన్‌ జాన్‌ కొక్కెన్‌ సోషల్‌మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఈ సందర్భంగా తాను తండ్రియ్యానంటూ మురిసిపోయిన జాన్‌ తన కుమారుడికి కియాన్‌ కొక్కెన్‌ అని నామకరణం చేసినట్లు ప్రకటించాడు. దీంతో పలువురు ప్రముఖులు, నెటిజన్లు పూజ- జాన్‌ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పూజ విషయానికొస్తే..నిఖిల్‌ స్వామిరారా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది . ఈ సినిమాలో హీరో ఫ్రెండ్స్‌లో ఒకరిగా నటించిన ఆమె తన అందం, తెలివితేటలతో అందరినీ బురిడి కొట్టించడం ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. కర్లీ హెయిర్‌తో ఎంతో క్యూట్‌గా కనిపించి కుర్రాళ్ల హృదయాల్లో గిలిగింతలు బెట్టిన ఈ బ్యూటీ కాంచన2, దోచేయ్‌, త్రిపుర, దళం, ఇంతలో ఎన్నెన్ని వింతలో, కృష్ణార్జున యుద్ధం, వెంకీమామ, ఎంత మంచివాడవురా, అంధకారం, పవర్‌ ప్లే తదితర సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2లో వైల్డ్‌ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చింది. కొన్నిరోజులు తన ఆటలు, పాటలతో ఆకట్టుకున్న పూజ పలు కంటెస్టెంట్లకు గట్టి పోటీనే ఇచ్చింది. ఇక జాన్‌ కొక్కెన్‌ విషయానికొస్తే.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌ విలన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవల కేజీఎఫ్‌ సిరీస్‌లతో పాటు అజిత్‌ తెగింపు, కబ్జా సినిమాల్లోనూ నటించాడు. ఇక తెలుగులో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలోనూ విలన్‌గా మెప్పించాడు.

ఇటీవల అజిత్‌ నటించిన తునివు (తెలుగులో తెగింపు) సినిమాలోనూ తన విలనిజంతో ఆకట్టుకున్నాడు. అలాగే మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్యలోనూ ఓ కీలక పాత్ర పోషించాడు. కాగా పూజా- జాన్‌లిద్దరికీ ఇది రెండో వివాహం. మొదట 2010లో విజె క్రెయిగ్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది పూజ. అయితే కొద్ది కాలానికే ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఆతర్వాత జాన్ కొక్కెన్‌ను పెళ్లాడింది పూజ.  2019లో వీరి పెళ్లి జరిగింది. ఇప్పుడీ ప్రేమ బంధానికి గుర్తుగా తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *