బాలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు సల్మాన్. ప్రస్తుతం ఆయన వయసు 57 ఏళ్లు. ఇప్పటికీ సింగిల్‏గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు సల్మాన్. ఆయన సినిమాలకు సంబంధించిన విషయాలు కాకుండా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతోనే నిత్యం వార్తలలో నిలుస్తుంటారు.

సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. బాలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు సల్మాన్. ప్రస్తుతం ఆయన వయసు 57 ఏళ్లు. ఇప్పటికీ సింగిల్‏గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు సల్మాన్. ఆయన సినిమాలకు సంబంధించిన విషయాలు కాకుండా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతోనే నిత్యం వార్తలలో నిలుస్తుంటారు. ముఖ్యంగా… పలువురు హీరోయిన్లతో లవ్, డేటింగ్ అంటూ ఎప్పుడూ వార్తలు వినిపిస్తుంటాయి. ఐశ్వర్య రాయ్ నుంచి కత్రినా వరకు చాలా మంది హీరోయిన్లతో సల్మాన్ ప్రేమలో పడినట్లు బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తుంటుంది. ఇటీవల కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ మూవీ మిశ్రమ స్పందన అందుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా.. రజత్ శర్మ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆప్ కి అదాలత్ షోలో పాల్గోన్నారు సల్మాన్.

తాజాగా వీరి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. మూవ్ ఆన్ కామెంట్ పై స్పందించాలని కోరగా.. సల్మాన్ మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాలుగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తిగా మారుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ప్రేమ జీవితం గురించి చెప్పాలని అడగ్గా.. ‘నేను ప్రేమలో దురదృష్టవంతుడిని’ అంటూ నవ్వుతూనే బాధను వ్యక్తం చేశాడు. ‘నన్ను జాన్ అని పిలవాల్సిన అమ్మాయి.. ఇప్పుడు బాయ్’ అని పిలుస్తుంది. నేనెం చేయాలి అంటూ సమాధానమిచ్చాడు సల్మాన్. ఈ ఎపిసోడ్ శనివారం ఇండియా టీవీలో స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండిఇటీవల కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాతో థియేటర్లలో సందడి చేశారు సల్మాన్ ఖాన్. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించగా.. విక్టరీ వెంకటేష్, భూమిక కీలకపాత్రలలో నటించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్డ్స్ రివ్యూ వచ్చింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ టైగర్ 3లో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *