అప్పట్లో సీనియర్ హీరోయిన్ ఖుష్బూకు తమిళనాడులోని పలువురు ఫ్యాన్స్ స్పెషల్ గా గుడి కట్టిన సంగతి తెలిసిందే. ఇక అలాగే హీరో సోనూసూద్, నమితా, నిధి అగర్వాల్ వంటి తారలకు అభిమానులు గుడి కట్టగా.. తాజాగా ఈ జాబితాలోకి హీరోయిన్ సమంత చేరింది. సామ్ వీరాభిమాని ఒకరు ఇటీవల ఆమె కోసం గుడి కట్టి సామ్ విగ్రహాన్ని ప్రతిష్టించిన సంగతి తెలిసిందే.

సాధారణంగా హీరోహీరోయిన్స్ అంటే పడిచచ్చే అభిమానులు ఉంటారు. తారల నటనకు.. డ్యాన్స్‏కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారన్న సంగతి తెలిసిందే. తమకు ఇష్టమైన సెలబ్రెటీల కోసం ఏం చేయాడానికైన సిద్దపడుతుంటారు. తమ తారల పుట్టిన రోజున సందర్భంగా వారి పేరు అన్నదానం.. వస్త్రదానం చేయడం చూస్తుంటాం. ఇక మరీ విపరీతమైన అభిమానం పెరిగితే వారికి ప్రత్యేకంగా గుడి కట్టిస్తుంటారు. అప్పట్లో సీనియర్ హీరోయిన్ ఖుష్బూకు తమిళనాడులోని పలువురు ఫ్యాన్స్ స్పెషల్ గా గుడి కట్టిన సంగతి తెలిసిందే. ఇక అలాగే హీరో సోనూసూద్, నమితా, నిధి అగర్వాల్ వంటి తారలకు అభిమానులు గుడి కట్టగా.. తాజాగా ఈ జాబితాలోకి హీరోయిన్ సమంత చేరింది. సామ్ వీరాభిమాని ఒకరు ఇటీవల ఆమె కోసం గుడి కట్టి సామ్ విగ్రహాన్ని ప్రతిష్టించిన సంగతి తెలిసిందే.

బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన సందీప్ కు సమంత అంటే విపరీతమైన పిచ్చి. ఆమె కోసం ఏకంగా తన ఇంట్లోనే గుడి కట్టించుకున్నాడు. ఇటీవల సామ్ పుట్టినరోజు సందర్భంగా ఆ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సందీప్ కుటుంబ సభ్యులే కాకుండా.. స్థానికులు పాల్గొన్నారు. నటి విగ్రహంతో ఫోటోలు దిగారు. అనంతరం సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సందీప్ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచాడు. అయితే సమంతకు అభిమాని కావడానికి పెద్ద కారణమే ఉంది.

ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రత్యూష ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్న పిల్లల కోసం ఆమె చేస్తోన్న సేవలకు సందీప్ ముగ్దుడయ్యాడు. ఈ క్రమంలోనే ఆమె గొప్పతనాన్ని చాటి చెప్పడం కోసం గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడట. తన ఇంటి ఆవరణలోనే సామ్ కోసం ప్రత్యేకంగా గుడి కట్టించి అందులో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ఇందుకోసం సందీప్ ఏకంగా రూ. 5 లక్షలు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. సమంత గుడికి సంబంధించిన ఫోటోస్ వైరల్ కావడంతో తెగ ట్రోల్స్ జరుగుతున్నాయి. అందుకు కారణం గుడిలో స్థాపించిన విగ్రహం సమంతలాగా లేకపోవడమే. దీంతో నెట్టింట సామ్ గుడిపై ఫన్నీ మీమ్స్ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed