
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ చిత్రంలో నటిస్తుంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో ఆద్య పాత్రలో కనిపించనుంది శ్రుతి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో రాబోతుండడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం ఈ ఒక్క సినిమా మాత్రమే శ్రుతి చేతిలో ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా న్యాచురల్ స్టార్ నానితో జత కట్టబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది.
న్యాచురల్ స్టార్ నాని.. మృణాల్ ఠాకూర్ జంటగా ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాని కెరీర్ లో30వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మరోసారి నాని ఫాదర్ పాత్రలో కనిపించబోతున్నారు. లేటేస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమాలో శ్రుతి హాసన్ కీలకపాత్రలో కనిపించనున్నారట. ఇందులో తన పాత్ర నచ్చడంతో శ్రుతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
అంతేకాకుండా ఈరోజు నాని 30 సినిమా షూటింగ్ లో ఆమె జాయిన్ అయ్యారని సమాచారం. ఇప్పటివరకు నాని, శ్రుతి కలిసి ఒక్క సినిమా చేయలేదు. మొదటిసారి వీళ్లిద్దరి కాంబో రాబోతుండడంతో ఈ మూవీపై మరింత క్యూరియాసిటి పెరిగింది. ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చెరుకూరి వెంకట మోహన్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు మేకర్స్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.