ఒకప్పుడు తెలుగులో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆ అందాల తార.. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తుంది. పైన ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి. ఆమె సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరో సతీమణి. గుర్తుపట్టండి. తను మరెవరో కాదు..

హీరోయిన్ అంటే అందం మాత్రమే కాదు.. ఫిట్ నెస్ ముఖ్యమే. అందుకే తమ శరీరాకృతిపై ఎక్కువగా శ్రద్ద పెడుతుంటారు అందాల ముద్దుగుమ్మలు. తాము జిమ్ లో వర్కవుట్స్ చేస్తోన్న వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు హీరోయిన్స్. సమంత , తమన్నా, రాశిఖన్నా, జాన్వీ కపూర్ వంటి తారలు జిమ్ లో కష్టపడుతున్న వీడియోస్.. పిక్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తుంటాయి. తాజాగా కుర్రహీరోయిన్లకు పోటీనిస్తూ మేమేం తక్కువ కాదని ప్రూవ్ చేస్తోంది ఓ సీనియర్ హీరోయిన్. ఒకప్పుడు తెలుగులో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆ అందాల తార.. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తుంది. పైన ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి. ఆమె సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరో సతీమణి. గుర్తుపట్టండి. తను మరెవరో కాదు.. హీరోయిన్ జ్యోతిక.

తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు జ్యోతిక. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే తమిళ్ స్టార్ సూర్యను ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఆమె..చాలా సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మరోసారి నటిగా ప్రశంసలు అందుకుంటుంది. అచి తుచి సినిమాలను ఎంచుకుంటూ వరుసగా విజయాలను ఖాతాలో వేసుకుంటున్నారు.

ఓవైపు సినిమాలు చేస్తున్నప్పటికీ… నిర్మాతగానూ పలు చిత్రాలు నిర్మిస్తున్నారు జ్యోతిక. రోజూ బిజీ షెడ్యూల్ తో గడిపే ఆమె.. తాజాగా తన జిమ్ వీడియోస్ నెట్టింట షేర్ చేశారు. ప్రస్తుతం జ్యోతిక వయసు 44 సంవత్సరాలు. ఈ వయసులోనూ ఫుల్ ఎనర్జీతో కష్టతరమైన వర్కవుట్స్ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. అందులో సింగిల్ హ్యాండ్ పై బ్యాలన్స్ చేయడంతోపాటు..హీరోలకు సైతం సాధ్యం కానీ ఫీట్స్ చేస్తూ అబ్బురపరుస్తుంది. ఇక కర్రసాములోనూ జ్యోతిక అదరగొట్టేస్తుందన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *