రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రతి రోజు పండగే తర్వాత వరుసగా సినిమాలు చేసిన అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. ఇక ఇప్పుడు విరుపాక్షతో మంచి సక్సెస్ సాధించాడు ఈ యంగ్ హీరో.

సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ సూపర్ హిట్ విరూపాక్ష ఇప్పటికి ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోంది. చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నాడు. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రతి రోజు పండగే తర్వాత వరుసగా సినిమాలు చేసిన అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. ఇక ఇప్పుడు విరుపాక్షతో మంచి సక్సెస్ సాధించాడు ఈ యంగ్ హీరో. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సస్పెన్న్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి ఈ సినిమాకు.

ఇక ఈ సినిమా ఇప్పటికి కూడా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ట్విస్ట్ లు, సస్పెన్స్ తో సాగిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు.

ఇక ఈ సినిమా ఫస్ట్ వీక్ ఎంత కలెక్షన్స్ వసూల్ చేసిందంటే..నైజాం 11.10 కోట్లు , సీడెడ్ 3.63 కోట్లు, ఉత్తరాంధ్ర 3.23 కోట్లు, ఈస్ట్ 1.77 కోట్లు, వెస్ట్ 1.23 కోట్లు, గుంటూరు 1.66 కోట్లు, కృష్ణా 1.62 కోట్లు,నెల్లూరు 0.78 కోట్లు, ఏపీ , తెలంగాణ టోటల్ 24.99 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 2.18 కోట్లు, ఓవర్సీస్ 4.35 కోట్లు, వరల్డ్ వైడ్ టోటల్ 31.52 కోట్లు షేర్ రాబట్టింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *