రాష్ట్రంలో 80శాతం మంది ప్రజలు మా నమ్మకం నువ్వే జగన్ అంటున్నారంటోంది వైసీపీ. జగనన్నే మా భవిష్యత్తు అంటూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీపుల్స్ సర్వే వివరాలు బయటపెట్టింది అధికారపార్టీ. ప్రజలకు అందుతున్న సంక్షేమం, హామీల అమల్లో చిత్తశుద్ది తమను ప్రజలకు చేరువ చేసిందని వైసీపీ అంటోంది.