వేసవి కాలంలో పచ్చళ్లు తింటే మీ శరీరంపై వేడి ప్రభావం పెరుగుతుంది. వేసవిలో కొన్ని పచ్చళ్లు అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగిస్తాయి.

వేసవి కాలంలో పచ్చళ్లు తింటే మీ శరీరంపై వేడి ప్రభావం పెరుగుతుంది. వేసవిలో కొన్ని పచ్చళ్లు అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగిస్తాయి. అయితే కొన్ని పచ్చళ్లను వేసవి సీజన్‌లో మీరు తప్పక ఎంచుకోవాలి. అలాంటి 5 ఆరోగ్యకరమైన, రుచికరమైన చట్నీల గురించి తెలుసుకుందాం.

పుదీనా చట్నీ:

వేసవికాలంలో పుదీనాతో చేసిన చట్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పుదీనాలో ఉన్నటువంటి మెంతాల్ పదార్థంధం మీ శరీరానికి శీతలాన్ని కలిగిస్తుంది. శరీరంలో నీరు కోల్పోకుండా పుదీనా తోడ్పడుతుంది. దీంతో పాటు పుదీనా చెట్నీ మీ కడుపులో గ్యాస్, అల్సర్ వంటి వ్యాధులు కలగకుండా చూస్తుంది.

ఇవి కూడా చదవండి



కొబ్బరి చట్నీ:

పుదీనా చట్నీ మాదిరిగానే, కొబ్బరి చట్నీ కూడా వేసవిలో చాలా మంచిది. ఈ సీజన్‌లో మంచి పోషక పదార్థాలను మీకు ఇస్తుంది. ఈ చట్నీ చేసేటప్పుడు మీరు మెంతి గింజలను కూడా జోడించవచ్చు, ఎందుకంటే ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడతాయి.అదనపు తాజాదనం కోసం కొద్దిగా పుదీనా, కొత్తిమీరను కలపాలి.

దోసకాయ చట్నీ:

ఈ సౌత్-ఇండియన్ స్టైల్ చట్నీ. దోసకాయ రుచులను ఆస్వాదించడానికి ఒక ప్రత్యేకమైన మార్గం. ఈ ఆరోగ్యకరమైన చట్నీని మీరు దోసెలు, ఇడ్లీలతో తినవచ్చు.మీరు ఈ సీజన్‌లో ఏదైనా వెరైటీగా ప్రయత్నించాలని చూస్తున్నట్లయితే దోసకాయ చట్నీ మీకు మంచి చాయిస్.

మామిడి పచ్చడి;

మామిడిపండ్లు లేకుండా వేసవి కాలం దాటదు- ఆకుపచ్చటి మామిడి పండ్లు శరీరంలో వేడిని చల్లబరుస్తుంది. అయితే ఈ చట్నీని సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా, మామిడి కాయను తురిమి అందులో పోపు దినుసులు కలిపి, పచ్చిగానే అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.

ఉసిరికాయ చట్నీ:

వేసవిలో ఉసిరికాయ చట్నీ తినడం ద్వారా మీ శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఉసిరికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మీ శరీరానికి చలువను అందిస్తాయి. అంతేకాదు ఉసిరికాయ చట్నీ సంవత్సరం అంతా నిలవ ఉంటుంది కాబట్టి. మీ కాలాల్లోనూ తినవచ్చు.

టమాటో చట్నీ:

పచ్చి టమాటాలతో చేసే ఈ చట్నీ చాలా రుచికరంగా ఉంటుంది ముఖ్యంగా వేసవి కాలంలో సలాడ్ లాంటి ఈ చట్నీని తినడం ద్వారా మీ శరీరంలో వేడిని బయటికి తరిమేయవచ్చు. అలాగే టమాటో చట్నీ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని చపాతీల్లోనూ దోశల్లోనూ శుభ్రంగా తినవచ్చు.

కొత్తిమీర పచ్చడి:

వేసవికాలంలో చేసే కొత్తిమీర పచ్చడి మీ శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. . అంతేకాదు కొడుకు సంబంధించి వ్యాధులకు కొత్తిమీర చాలా ఉపయోగపడుతుంది. అందుకే కొత్తిమీరతో చేసిన పచ్చడిని తినడం ద్వారా మీకు ఎలాంటి ప్రమాదము సంభవించదు. అలాగే కొత్తిమీర శరీరంలో వేడిని బయటకు తరమేస్తుంది.

బచ్చలి కూర పచ్చడి:

బచ్చలి కూరలో అనేక పోషక పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా వేసవికాలంలో మన శరీరం కోల్పోయే అనేక పోషక పదార్థాలను ఈ పచ్చడి చేస్తుంది. అందుకే ఈ పచ్చడిని తినడం ద్వారా మీరు అనేక వ్యాధులను మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *