టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు జనసేన పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్. బాబు-పవన్‌ భేటీ సీక్రెట్‌‌ను రివీల్‌ చేశారు నాదెండ్ల. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆక్ష్న.. చంద్రబాబు, పవన్‌ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాబోయే ఎన్నికలకు పవన్‌ సిద్ధమవుతున్నారని, అందులో భాగంగానే చంద్రబాబుతో చర్చలు జరిపారన్నారు. ప్రజలకు నమ్మకమైన, ప్రత్యామ్నాయం ఏర్పాటుకు జనసేన ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు నాదెండ్ల మనోహర్‌. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండాఉండేందుకే పవన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తాము పదవుల కోసం కాదని, ప్రజల కోసం పనిచేస్తామని అన్నారు. భవిష్యత్‌లో మరికొన్ని సమావేశాలు జరుగుతాయని, అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు నాదెండ్ల మనోహర్.

ఇకపోతే చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. జనసేనాని ఉన్నట్టుండి చంద్రబాబు ఇంటికెళ్లడం సంచలనం సృష్టిస్తోంది. ఇంత సడన్‌గా బాబుతో పవన్‌ ఎందుకు భేటీ అయ్యారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు కోసమేనా?. అసలు, చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ ఏం చర్చించారు? అంటూ పీక్స్‌లో డిస్కర్షన్ జరిగింది. చివరకు ఈ ఉత్కంఠకు నాదెండ్ల మనోహర్ తెరదించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *