ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వైకాపా సమన్వయకర్త పదవికి శనివారం (ఏప్రిల్‌ 29) రాజీనామా చేశారు. సొంత నియోజకవర్గం ఒంగోలుపై మరింత దృష్టి సారించేందుకు, అనారోగ్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాలినేని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు నెల్లూరు, తిరుపతి, వైయస్‌ఆర్‌ జిల్లాలకు..

ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వైకాపా సమన్వయకర్త పదవికి శనివారం (ఏప్రిల్‌ 29) రాజీనామా చేశారు. సొంత నియోజకవర్గం ఒంగోలుపై మరింత దృష్టి సారించేందుకు, అనారోగ్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాలినేని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు నెల్లూరు, తిరుపతి, వైయస్‌ఆర్‌ జిల్లాలకు సమన్వయకర్తగా ఉన్న బాలినేని తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు అధిష్టానానికి లేఖ రాశారు. మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకడం, తమ జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్‌ను మంత్రిగా కొనసాగించడంపై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా గతంలోనూ పార్టీ నాయకత్వంపై అలకబూనారు. ఇటీవల మార్కాపురంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా తలెత్తిన ప్రొటోకాల్‌ వివాదం మరింత అగ్గిరాజేసింది. 2024 ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు దక్కదని, వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఓ మహిళకు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పంపిన రాజీనామా లేఖ సంచలనంగా మారింది.

ఇటీవల విశాఖపట్నంకు చెందిన జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ మాజీ మంత్రి బాలినేని, ఆయన వియ్యంకుడు కుండా భాస్కరరెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేశారు. ఒంగోలులో భాస్కరరెడ్డి చేపట్టిన శ్రీకరి ఎంపైర్‌ విల్లా నిర్మాణాల్లో ఆక్రమణలకు పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన డీఎస్పీల బదిలీల విషయంలోనూ తనకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆయన భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటి వెనుక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి హస్తం ఉందనేది బాలినేని అనుమానం. తనకు విలువలేని చోట పార్టీ పదవుల్లో కొనసాగటం ఇష్టం లేదని ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఇక పార్టీ అధిష్టానం బాలినేని నిర్ణయంపై పునరాలోచన చేస్తారో లేదో వేచిచూడాలి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *