తెలంగాణ గుండెకాయ సచివాలయాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటో అర్థం కాని కొందరు మరగుజ్జులు మొత్తం తెలంగాణనే కూలగొట్టి కడుతారా? అని చిల్లర వ్యాఖ్యలు చేశారన్నారు. అవేమీ పట్టించుకోకుండా ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం చేసుకున్నామన్నారు.
నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రారంభించారు. నూతన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసి కొత్త భవనంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు సచివాలయ ప్రారంభం తన చేతుల మీదుగా ప్రారంభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త సచివాలయం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ చూపిన మార్గంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామన్నారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అందరికీ జోహార్లు అర్పించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే రాష్ట్రం వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఆయన చూపిన బాటలోనే ముందుకు సాగుతున్నామన్నారు. నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టుకోవడం గర్వకారణం అని.. దీని నిర్మాణంలో అందరి కృషి ఉందన్నారు.
తెలంగాణ గుండెకాయ సచివాలయాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటో అర్థం కాని కొందరు మరగుజ్జులు మొత్తం తెలంగాణనే కూలగొట్టి కడుతారా? అని చిల్లర వ్యాఖ్యలు చేశారన్నారు. అవేమీ పట్టించుకోకుండా ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం చేసుకున్నామన్నారు. సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉందని వెల్లడించారు. సచివాలయ తరహాలోనే తెలంగాణ పల్లెలు కూడా వెలిగిపోతున్నాయని చెప్పారు.
సెక్రటేరియట్ తరహాలోనే తెలంగాణ పల్లెలూ వెలుగుతున్నాయన్నారు. ప్రపంచ ఇంజినీరింగ్ అద్భుతాలు అనేలా చాలా ప్రాజెక్టులు కట్టుకున్నామన్నారు. కొత్త సచివాలయ ఆర్కిటెక్టులు, నిర్మాణ సంస్థకు, నిర్మాణంలో చెమట చిందించిన ప్రతి శ్రామికుడికీ ధన్యవాదాలు తెలిపారు.
కానే కావు.. రానే రావు.. మీకు నీళ్లు ఎలా..
చాలా పొద్ద పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంగతి తెలిసిందే. కానే కావు.. రానే రావు.. మీకు నీళ్లు ఎలా వస్తాయి. తెలంగాణ వెనకబడిన ప్రాంతం అని చెప్పన విషయాలను మనం చూశారు. హైదరబాద్ మినహా తొమ్మిది జిల్లాలను వెనకబడిన జిల్లాల లిస్టులో పెట్టిన సంగతి మనం చూశాం. తెలంగాణలాంటి పల్లెలు దేశంలో మరెక్కడా లేవు. అంబేద్కర్ చూపిన మార్గంలోనే తెలంగాణ సాధించుకున్నాం. సమతామూర్తి అంబేద్కర్ చూపిన బాటలోనే మన పరిపాలన సాగుతోంది. అన్ని వర్గాల్లో చిరునవ్వులు వెల్లివరిరియాలన్న అంబేద్కర్ ఆశయాలే మకు స్ఫూర్తి అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ విరాజిల్లుతోంది..
వెలుగు జిలుగులతో తెలంగాణ విరాజిల్లుతోందన్నారు సీఎం కేసీఆర్. ఇది తెలంగాణ పునర్నిర్మాణం… కరెంట్ షాక్‌లతో రైతులు చనిపోయారు. కానీ నేడు 24 గంటల కరెంట్‌తో రైతులు కంటి నిండా నిద్ర పోతున్నారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి. అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్నాయి. ఆగమైపోయిన అడవులు పునర్నిర్మాణం చేసుకున్నాం. హరితశోభను వెదజల్లుతున్నాయి. వలసపోయిన పాలమూరు వాసులు తిరిగొచ్చి తమ పొలాల్లో పనులు చేసుకుంటున్నారు. కూలీలు సరిపోక ఇతర రాష్ట్రాల కూలీలు పాలమూరుకు వస్తున్నారు. ఇది తెలంగాణ పునర్నిర్మాణం. మిషన్ భగీరథ తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రజలు తాగే నీటిని ఆదిలాబాద్‌లోని గోండు ప్రజలు కూడా తాగుతున్నారు.
మహిళలకు భరోసానిస్తూ భరోసా కేంద్రాలు..
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో మత కల్లోలాలు లేవు. గత డీజీపీలు అనురాగ్ శర్మ, మహేందర్ రెడ్డి అద్భుతంగా పని చేశారని ప్రశంసించారు సీఎం కేసీఆర్. ప్రస్తుత డీజీపీ అజంనీ కుమార్ ఆధ్వర్యంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. మహిళలకు భరోసానిస్తూ భరోసా కేంద్రాలు, షీ టీమ్స్ పని చేస్తున్నాయన్నారు. అరాచక ముఠాలను నివారిస్తున్నామన్నారు. సమ్మిళిత అభివృద్ధితో ముందుకు పోతున్నామని ప్రకటించారు. పారిశ్రామిక రంగంలో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఐటీ విధానంలో బెంగళూరును దాటి పోతున్నామని అన్నారు సీఎం కేసీఆర్.
..లింక్ రోడ్లతో హైదరాబాద్ అభివృద్ధి
మురికి కూపాలుగా ఉన్న పట్టణాలను అభివృద్ధి చేస్తున్నాం. పచ్చదనం, డంపుయార్డులతో, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లతో పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. అంతర్జాతీయ నగరాలకు ధీటుగా రూపుదిద్దుకుంటుంది తెలంగాణ. అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్లు, లింక్ రోడ్లతో హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది. నగరం నలుదిక్కులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తున్నాం. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది.
ప్రపంచంలో అభివృద్ధిని, పునర్నిర్మాణాన్ని కొలమానంగా తీసుకునే సూచికలు రెండే రెండు ఉన్నాయని అన్నారు. ఒకటి పర్ క్యాపిట ఇన్‌కం. రెండోది పర్ క్యాపిట పవర్ యుటిలైజేషన్. ఇవి నిజమైన అభివృద్ధి సంకేతాలు. నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్లో ముందున్నాం. తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, దేశంలోనే నంబర్ వన్ స్థాయికి పర్ క్యాపిటలో ముందున్నాం. పవర్ యుటిలైజేషన్‌లో 2,140 యూనిట్లతో దేశంలోనే అగ్రభాగాన ఉన్నాం. ఆసరా పెన్షన్లతో పేదల ముఖాల్లో చిరునవ్వులు చూస్తున్నాం. సచివాలయం నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.
కొందరు అవాకులు చెవాకులు పేలారు..
తెలంగాణ పునర్నిర్మాణంపై కొందరు అవాకులు చెవాకులు పేలారు. రాష్ట్రం మొత్తం కూలగొట్టి కడతారా అని హేళన చేశారు. విమర్శలు పట్టించుకోకుండా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయడమే మా విధానం. ప్రస్తుతం సమ్మిళిత అభివృద్ధితో తెలంగాణ ముందుకెళ్తోంది. ఐటీలో బెంగళూరును దాటి దూసుకుపోతోంది. యాదాద్రి పునర్నిర్మాణం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమే. ఇప్పుడు యాదాద్రి.. భూలోక వైకుంఠంగా విరాజిల్లుతోంది. కోల్పోయిన అడవులు తిరిగి తెచ్చుకోవడం, వలసలు వెళ్లిన పాలమూరు బిడ్డలు వెనక్కి రావడం రాష్ట్ర పునర్నిర్మాణమే. కొత్త సచివాలయం తెలంగాణ పునర్నిర్మాణానికి నిలవెత్తు సాక్ష్యం అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం