IPL 2023, CSK vs PBKS: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఈ క్రమంలో టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోని 20వ ఓవర్‌లో బ్యాటింగ్‌కి

IPL 2023, CSK vs PBKS: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఈ క్రమంలో టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోని 20వ ఓవర్‌లో బ్యాటింగ్‌కి వచ్చి, 4 బంతుల్లోనే 2 సిక్సర్లతో అజేయంగా 13 పరుగులు చేశాడు. దీంతో ధోని టీ20 క్రికెట్‌లో ఓ అరుదైన రికార్డును సృష్టించాడు. టీ20 ఫార్మాట్ 20వ ఓవర్లో 1000 పరుగులు బాదిన రెండో బ్యాటర్‌గా చరిత్ర పుటల్లో నిలిచాడు. అలాగే టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా కూడా రికార్డులకెక్కాడు.

అయితే ధోని కంటే ముందుగా ఈ ఘనతను ముంబై ఇండియన్స్ బ్యాటర్ కీరన్ పొలార్డ్ అందుకున్నాడు. తద్వారా ఈ ఘనతను అందుకున్న రెండో ప్లేయర్‌గా ధోని అవతరించాడు. కానీ ఐపీఎల్‌లో ఈ లెక్కలు పూర్తిగా వేరు. ఐపీఎల్ క్రికెట్‌లో 20వ ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తూ ధోని 709 పరుగులు చేయగా, పొలార్డ్ 405 రన్స్ మాత్రమే చేయగలిగాడు. ఇక ధోని తన టీ20 కెరీర్‌లో 20వ ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తూ  మొత్తం 74 సిక్స్‌లు, 73 ఫోర్లు బాదాడు. అలాగే తన టీ20 క్రికెట్ పరుగులలో 13.28 శాతం రన్స్ చివరి ఓవర్‌లో వచ్చినవే కావడం విశేషం.

ఇవి కూడా చదవండి



కాగా, మ్యాచ్ విషయానికి వస్తే చెన్నై టీమ్ ఇచ్చిన 201 లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు 15 ఓవర్లలో 3వికెట్లు కొల్పోయి, 129 పరుగులే చేసింది. ఇంకా ఆ టీమ్ విజయ తీరాలకు చేరాలంటే చివరి 5 ఓవర్లలో 72పరుగులు చేయాలి. అంతకముందు బ్యాటింగ్ చేసిన చెన్నై తరఫున డెవాన్ కాన్వే అజేయంగా 92 పరుగులు చేశాడు. అతనితో పాటు రుతురాజ్(37), శివమ్ దుబే(28), మొయిన్ ఆలీ(10, జడేజా(12), ధోని (13 నాటౌట్) తమ వంతు పాత్ర పోషించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *