Garlic Health Benefits: భారతదేశంలోని ప్రతి వంట గది ఓ ఔషధ భాండాగారం. ఇందులో ఉండే మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలను సరైన రీతిలో ఉపయోగించుకుంటే సఖల రోగాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే పదార్థాలలో వెల్లుల్లి కూడా ఒకటి. ఆహారపు రుచిని పంచుకునేందుకు..

Garlic Health Benefits: భారతదేశంలోని ప్రతి వంట గది ఓ ఔషధ భాండాగారం. ఇందులో ఉండే మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలను సరైన రీతిలో ఉపయోగించుకుంటే సఖల రోగాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే పదార్థాలలో వెల్లుల్లి కూడా ఒకటి. ఆహారపు రుచిని పంచుకునేందుకు ఉపయోగించే వెల్లుల్లి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ముఖ్యంగా శరీర నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ఫలితంగా ఎన్నో రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి మనకు రక్షణ కలుగుతుంది. అయితే వెల్లుల్లిని ఆహారంలో కంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ  క్రమంలో ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూద్దాం..

పరగడుపున వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

  • క్యాన్సర్ నివారణ: వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్ గుణాలు ఉన్నందున ఇది క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తుంది. అందువల్ల ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తినండి.
  • మధుమేహం: వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకోసం డయాబెటిక్ పేషెంట్లు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లి రెబ్బలు తినాలని నిపుణులు చెబుతున్నారు.
  • బరువు తగ్గడం: అధిక బరువుతో బాధపడేవారికి కూడా వెల్లుల్లి ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకోసం మీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతూ వెల్లుల్లి రెబ్బలు తింటే చాలు. శరీరంలోని చెడు కొవ్వును కరిగించగలిగే సమ్మేళనాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
  • డిప్రెషన్‌కి చెక్: వెల్లుల్లి మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. డిప్రెషన్‌తో పోరాడే శక్తి ఇందులో ఉండడం వల్ల మీకు ఉపయోగకరంగా ఉంటుంది.
  • రక్తపోటుకి చెక్: రక్తపోటును తగ్గించడంలో కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. అందుకోసం మీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక వెల్లుల్లి రెబ్బను తింటే చాలు.
  • కొలెస్ట్రాల్: ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకోవడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిపోతుంది. ఫలితంగా మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని టీవీ9 ధృవీకరించడం లేదు. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి



లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *