పూతరేకులు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్రేయపురం. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం పూతరేకులు తిని తీరాల్సిందే. ఇక్కడి పూతరేకులకు ఉన్న ప్రత్యేకత అలాంటింది. ఇటీవలే అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందాయి ఈ పూతరేకులు.

పూతరేకులు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్రేయపురం. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం పూతరేకులు తిని తీరాల్సిందే. ఇక్కడి పూతరేకులకు ఉన్న ప్రత్యేకత అలాంటింది. ఇటీవలే అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందాయి ఈ పూతరేకులు. ఇవి అనేక ప్రాంతాల్లో లభించినా.. ఆత్రేయపురం పూతరేకులకు అవేవీ సాటిరావు. దేశవిదేశాలకు ఇక్కడినుంచి పూతరేకులను తీసుకెళ్తుంటారు. తాజాగా అక్షయ తృతీయం సందర్భంగా ఓ వ్యాపారి బంగారంతో పూతరేకులు తయారుచేశాడు.అవును, స్వీట్స్‌ తయారీలో ఉపయోగించే ఎడిబుల్‌ గోల్డ్‌తో ఈ పూతరేకులు తయారు చేశారు. ఆత్రేయపురంలోనే చాదస్తం స్వీట్‌ షాపులో 24 క్యారెట్ల ఎడిబుల్‌ గోల్డ్‌తో పూతరేకులు తయారు చేశారు. అక్షయ తృతీయరోజు అందరూ బంగారం కొనేందుకు మక్కువ చూపుతారు. అది దృష్టిలో పెట్టుకునే ఈ పూతరేకులు చేసినట్లు షాపు యజమాని సాయి తెలిపారు. బంగారంతో తయారుచేసిన పూతరేకులను రుచి చూసిన జనం వాటిని కొనేందుకు పోటీపడ్డారు. ఒక్కో పూతరేకు 800 రూపాయలకు విక్రయించినట్లు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed