మ్యాచోస్టార్‌ గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన తాజా చిత్రం రామబాణం. లక్ష్యం, లౌక్యం చిత్రాలతో ఆకట్టుకున్న డైరెక్టర్‌ శ్రీవాస్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జగపతి బాబు, ఖుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా మే 5న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.

మ్యాచోస్టార్‌ గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన తాజా చిత్రం రామబాణం. లక్ష్యం, లౌక్యం చిత్రాలతో ఆకట్టుకున్న డైరెక్టర్‌ శ్రీవాస్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జగపతి బాబు, ఖుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా మే 5న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉంటే తాజాగా గోపీచంద్ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. రామబాణం సినిమాలో ఐఫోన్ పిల్ల.. అంటూ సాగే ఓ పాట ఉంది. ఈ పాట ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో నా ప్రాణం ఆగదే పిల్ల.. అనే లైన్ ఉంది. అయితే కరీంనగర్‌కు చెందిన గొల్లపల్లి రవీందర్ అనే ఫోక్‌ సింగర్‌ ఈ పాట తనదే, ట్యూన్ కూడా తనదేనంటూ మీడియాను ఆశ్రయించారు. గొల్లపల్లి రవీందర్‌ ఈ పాటను 1992లో చేతికి గాజులు పిల్లో పాట రాశానని చెబుతున్నారు. అప్పట్లోనే ఆ పాటా బాగా హిట్‌ అయ్యిందన్నారు. ఆ పాటలోని లైన్ ని, తన ట్యూన్‌ని రామబాణం యూనిట్ తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాడుకున్నారని మండిపడుతున్నారు. సినిమా రిలీజ్‌ అయ్యేలోపు చిత్ర యూనిట్‌ వివరణ ఇవ్వకపోతే తానూ లీగల్‌గా వెళ్తానన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *