వేసవిలో జుట్టు రాలడం అనేది చాలా సాధారణ సమస్య. ఇతర సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్‌లో శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. శిరోజాల పెరుగుదలలో స్కాల్ప్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది.

వేసవిలో జుట్టు రాలడం అనేది చాలా సాధారణ సమస్య. ఇతర సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్‌లో శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. శిరోజాల పెరుగుదలలో స్కాల్ప్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే జుట్టు పోషణ చాలా ముఖ్యం. అలాగే వేసవిలో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని సింపుల్‌ టిప్స్ పాటించాలి. ముఖ్యంగా వేసవిలో స్కాల్ప్ మీద ఎక్కువగా చెమట పడుతుంది. ఇది శిరోజాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే క్రమం తప్పకుండా తలస్నానం చేస్తూ ఉండాలి. వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేయడం వల్ల బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. ఇందుకోసం సరైన షాంపూని ఎంచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మీ శిరోజాలను తేమగా ఉంచడానికి సరైన షాంపూని ఎంచుకోండి.

సరైన ఆహారంతో..
శిరోజాల ఆరోగ్యంలో సమతుల్య ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పొడి చర్మం ఉన్నట్లయితే ఆహారంలో ఒమేగా-3, సాల్మన్, చియా విత్తనాలు లేదా చేప నూనెను జోడించడం చాలా ముఖ్యం. అలాగే ప్రోటీన్‌ ను కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన జుట్టు అలాగే స్కాల్ప్‌కు కీలకం. యాంటీఆక్సిడెంట్లు, ప్రోబయోటిక్స్ మీ సమతుల్య ఆహారంలో భాగంగా ఉండాలి. స్కాల్ప్‌ను హైడ్రేట్ చేయడానికి అధిక నీటి కంటెంట్ ఉన్న పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

నీరు ఎక్కువగా..
ఆరోగ్యకరమైన శిరోజాల కోసం శరీరంలో నీటి స్థాయులు నిర్వహించడం చాలా అవసరం. వేసవిలో పుష్కలంగా నీరు తాగడం వల్ల జుట్టు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

 మసాజ్‌తో..
జుట్టుకు తరచూ కొబ్బరి నూనెతో సరైన మసాజ్ చేయడానికి కొంత సమయం కేటాయించండి. ఇది స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే జుట్టు రాలడం సమస్యను నివారిస్తుంది. చాలా ఒత్తిడి నుంచి రిలాక్సేషన్‌ను కూడా అందిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed