కొత్త సచివాలయంలో మంత్రి హరీష్‌రావు బాధ్యతలు చేపట్టారు. 1,827 స్టాఫ్‌నర్సుల పోస్టుల భర్తీపై తొలి సంతకం చేశారు. పంట సాయం విడుదల ఫైల్‌పై కూడా మంత్రి హరీష్‌రావు సంతకం చేశారు.
నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్నిముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.. నూతన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసి కొత్త భవనంలోకి ప్రవేశించారు. తర్వాత మంత్రులు తమ చాంబర్లలో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. మంత్రి కేటీఆర్.. పేదల ఆత్మగౌరవ ప్రతీక అయిన డబుల్ బెడ్‌రూం ఇళ్లకు సంబంధించిన ఫైలుపై సంతకం చేయగా.. మంత్రి హరీష్ రావు రెండు ఫైల్స్‌పై సంతకం చేశారు. ఇందులో స్టాఫ్ నర్సుల రిక్రూట్‌మెంట్‌పై మొదటి సంతకం చేశారు.. రాష్ట్రంలోని ప్రభుత్వ బోధన ఆసుపత్రుల్లో 1,827 స్టాఫ్ నర్సు పోస్టుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది.
టీచింగ్ ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్సుల రిక్రూట్‌మెంట్ దస్త్రంపై రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు మొదటి సంతకం చేశారు. ఇటీవల అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకు పంట సాయం కింద రూ.151.6 కోట్లు విడుదల చేస్తూ రెండో ఫైల్‌పై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇక నూతన సచివాలయంలోని మూడో అంతస్తులోని తన ఛాంబర్‌లో నిరాడబంరంగా బాధ్యతలు చేపట్టారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్. జీహెచ్‌ఎంసీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాలపై కేటీఆర్ తొలి సంతకం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం