Healthy Heart: కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు నిర్ధిష్ట కాలంలో మాత్రమే వస్తుంటాయి. అయితే వాటి కంటే సీజన్‌తో సంబంధం లేకుండా తలెత్తే వ్యాధులు, ఆరోగ్య సమస్యలే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అలాంటి వ్యాధుల్లో ప్రముఖమైనవి గుండెపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు. ఈ సమస్యలే..

Healthy Heart: కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు నిర్ధిష్ట కాలంలో మాత్రమే వస్తుంటాయి. అయితే వాటి కంటే సీజన్‌తో సంబంధం లేకుండా తలెత్తే వ్యాధులు, ఆరోగ్య సమస్యలే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అలాంటి వ్యాధుల్లో ప్రముఖమైనవి గుండెపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు. ఈ సమస్యలే ప్రపంచ మానవాళిని వణికిస్తున్న ఆరోగ్య సమస్యలలో ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఇక ఈ సమస్యలు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగానే పరిణమిస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈక్రమంలో కొన్ని రకాల ఆహారాలను మన డైట్‌లో చేర్చుకోవడం ద్వారా హృదయ  సంబంధిత సమస్యలను దూరంగా ఉంచవచ్చంటున్నారు నిపుణులు. అయితే ఈ హృదయ సంబంధిత సమస్యలకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటే గుండెపోటు సమస్య తలెత్తే అవకాశం కూడా తగ్గుముఖం పడుతుంది. ఈ నేపథ్యంలో శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించి, గుండెను కాపాడే ఆహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ద్రాక్ష: గుండె ఆరోగ్యాన్ని కాపాడే పండ్లలో ద్రాక్ష ప్రముఖమైనది. ద్రాక్షలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ తగ్గించడంలో దోహదపడతాయి. తద్వారా గుండెను రక్షించుకోవడంతో పాటు జీర్ణ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.

పియర్: కొలెస్ట్రాల్‌ని తగ్గించే గుణాలు పియర్‌లో ఎక్కువగా ఉండడం వల్ల ఇది మీ గుండెను కాపాడగలుగుతుంది. ఇంకా ఇందుకలో  పుష్కలంగా ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఇతర ఆరోగ్యప్రయోజనాలను కూడా అందిస్తాయి.

ఇవి కూడా చదవండి



యాపిల్: యాపిల్‌లో పుష్కలంగా ఉండే  పోలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి శరీరంలో మెటబోలిజం స్థాయిని పెంచి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో దోహదపడతాయి.

బొప్పాయి: బొప్పాయి కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ చాలా వేగంగా కరుగుతుంది. బొప్పాయితో బ్లడ్ ప్రెషర్ కూడా నియంత్రణలో ఉంటుంది.

ఆరెంజ్, నిమ్మ: ఆరెంజ్, నిమ్మలను తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ వేగంగా కరుగుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. తద్వారా హృదయ సంబంధిత వ్యాధులను నియంత్రించగలవు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed