2002లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు బి. గోపాల్ దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వని దత్ ఈ సినిమాను . ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా సోనాలి బింద్రే , ఆర్తి అగర్వాల్ నటించగా  శివాజీ , ముఖేష్ రిషి , ప్రకాష్ రాజ్ లు సహాయక పాత్రలు పోషించారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి స్టార్ డమ్ ను మరింత పెంచింది ఈ మూవీ. 2002లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు బి. గోపాల్ దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వని దత్ ఈ సినిమాను . ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా సోనాలి బింద్రే , ఆర్తి అగర్వాల్ నటించగా  శివాజీ , ముఖేష్ రిషి , ప్రకాష్ రాజ్ లు సహాయక పాత్రలు పోషించారు. అలాగే ఇంద్ర సినిమాకు మణి శర్మ సంగీతం అందించారు . ఈ చిత్రం మూడు రాష్ట్ర నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌ని గెలుచుకుంది , చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డును గెలుచుకున్నారు .ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు.

చిన్ని కృష్ణ అందించిన క‌థ ఈ క‌థ‌కు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ రాసిన ప‌వ‌ర్ పుల్ డైలాగ్‌లు రాశారు. చిన్నికృష్ణ కథను ముందుగా దర్శకుడు బి గోపాల్ రిజక్ట్ చేశారట. ముందుగా ఈ కథను సినిమా చేయడానికి బి గోపాల్ భయపడ్డాడట . అందుకు కారణం అంతకు ముందు ఆయన దర్శకత్వం వహించిన స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు రెండు సినిమాలు ఇంద్ర సినిమా కథలానే ఉండటం.

ఆ తర్వాత చిరంజీవి గోపాల్ కు నేను కథను విన్నాను చాలా బాగుంది. ఖచ్చితంగా హిట్ అవుతుందని అన్నారట. నేను ఇంటర్వెల్ వరకు విన్నాను కథ చాలా బాగుంది అని దైర్యం చెప్తే అప్పుడు బి గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారట. ఈ విషయాన్ని స్టార్ రచయిత ప‌రుచూరి గోపాల‌కృష్ణ తెలిపారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *