కర్నాటకలో మరోసారి డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఖాయమన్నారు మోదీ. ఖర్గే తనను సర్పంతో పోల్చడంపై బాధగా లేదన్నారు మోదీ. భగవాన్‌ శివుడి మెడలో సర్పం ఆభరణంగా ఉంటుందన్నారు. దేశ ప్రజలే తనకు ఈశ్వరుడి స్వరూపమన్నారు ప్రధాని మోదీ.

కర్నాటక ప్రచారంలో నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. దేశ ప్రజలే ఈశ్వరుడి స్వరూపమని , శివుడి మెడలో సర్పం ఆభరణమని .. ఖర్గే తనను సర్పంతో పోల్చడంపై స్పందించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. జేడీఎస్‌ కంచుకోట చెన్నపట్నలో కూడా ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్ధుల తరపున సుమలత కూడా ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే విమర్శలకు ఘాటైన కౌంటర్‌ ఇచ్చారు ప్రధాని మోదీ. కోలార్‌లో జరిగిన బీజేపీ ప్రచార సభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ. సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతల అవినీతిని బయటపెట్టినందుకే ఖర్గే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని అన్నారు. కర్నాటకలో మరోసారి డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఖాయమన్నారు మోదీ. ఖర్గే తనను సర్పంతో పోల్చడంపై బాధగా లేదన్నారు మోదీ. భగవాన్‌ శివుడి మెడలో సర్పం ఆభరణంగా ఉంటుందన్నారు. దేశ ప్రజలే తనకు ఈశ్వరుడి స్వరూపమన్నారు ప్రధాని మోదీ.

వారసత్వ రాజకీయాలను ఓడించాలని దేవగౌడ ఫ్యామిలీని టార్గెట్‌ చేస్తూ మోదీ విమర్శించారు. కాంగ్రెస్‌కు జేడీఎస్‌ బీటీమ్‌గా మారిందన్నారు. ఇవాళ అంటే ఆదివారం (ఏప్రిల్ 30) రాష్ట్రంలోని బేలూర్‌లో తన మూడవ ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కర్ణాటక ప్రాంతీయ పార్టీ జెడి(ఎస్)ని కాంగ్రెస్ బి టీమ్ అని పిలిచారు.

కాంగ్రెస్.. దాని బి టీమ్ కూడా పగటి కలలు కంటున్నాయని.. ఎలాగైనా 15-20 సీట్లు గెలవాలని, దోచుకున్న ప్రజాధనంలో తమ వాటా కావాలని ప్రధాని మోదీ తన ప్రసంగంలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) మధ్య వార్‌ నడుస్తోందని అన్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్, నూరాకుష్టి, పార్లమెంటులో కూడా ప్రతి విషయంలో కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ఉన్నాయి. మీరు జేడీఎస్‌కు ఇచ్చే ప్రతి ఓటు కాంగ్రెస్ ఖాతాలోకి వెళుతుందని, కాంగ్రెస్‌కు ఓటు వేయడం అంటే అభివృద్ధికి బ్రేకులు వేయడమేనని ప్రధాని మోదీ ప్రజలకు అభ్యర్థించారు.

JDS ఒక ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ

కర్ణాటకలోని బేలూర్ జిల్లా కాంగ్రెస్, జేడీ(ఎస్)లకు కంచుకోటగా చెప్పవచ్చు. ఈ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ‘కర్ణాటకలోని కాంగ్రెస్ యూనిట్ ఢిల్లీలో కూర్చున్న కుటుంబానికి సేవ చేయాలి. సీఎం, అభ్యర్థిని నిర్ణయించాలన్నా, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ కుటుంబ సభ్యులనే అడగాలి. కాంగ్రెస్ కుటుంబం ముందు తలవంచుకునే వాడు కాంగ్రెస్‌లోనే ఉంటాడని అన్నారు. JDS అనేది ఒక కుటుంబానికి చెందిన ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ అని కూడా ప్రధాని విమర్శించారు.

దశాబ్దాల నాటి సంకీర్ణ రాజకీయాలకు ఈసారి స్వస్తి పలకాలని కర్ణాటక నిర్ణయించినట్లు అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ అస్థిరతకు చిహ్నాలు అని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు నాయకుల మధ్య అంతర్గత పోరుకు ప్రసిద్ధి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతూ.. అక్కడి ప్రజలు తమ పాలనతో విసిగిపోయారని, ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *